Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 7, 2020, 6:56 PM IST
నాగబాబు (Nagababu)
ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షోను మూడు వారాల అదిరింది షోతో పోల్చడం సరైంది కాదు.. కానీ కచ్చితంగా పోలుస్తారు.. దానికి కారణం నాగబాబు. అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి కచ్చితంగా వద్దన్నా కూడా రేటింగ్స్ నుంచి అన్ని విషయాల్లోనూ జబర్దస్త్ షోతోనే అదిరిందిని పోలుస్తున్నారు. పైగా సేమ్ టూ సేమ్ అదే ఫార్మాట్ ఇక్కడా కూడా కాపీ చేస్తున్నారు దర్శకులు నితిన్ భరత్. పైగా అప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన టీం లీడర్స్.. ఇప్పుడు అదిరిందిలో కనిపిస్తున్నారు. దాంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే మొదలైంది షో కూడా. తొలి రెండు వారాల సంగతి ఎలా ఉన్నా మూడో వారంలో అయినా అదిరింది పుంజుకుంటుందని ఆశించారు నిర్వాహకులు. కానీ అలాంటిదేం జరగడం లేదని తెలుస్తుంది. కేవలం 3.5 రేటింగ్ మాత్రమే వచ్చింది దీనికి.

అదిరింది (credit - YT -
Zee Cinemalu)
అదే సమయంలో జబర్దస్త్ మాత్రం నాగబాబు వెళ్లిన తర్వాత కనీసం 9 వరకు మెయింటేన్ చేస్తుంది. దాంతో ఆయన జబర్దస్త్ వదిలేసి వచ్చినా పెద్దగా ప్రయోజనం అయితే కనిపించడం లేదు. ఏడేళ్లకు పైగా నవ్వుల నవాబుగా ఉన్నా కూడా ఎందుకో తెలియదు కానీ మల్లెమాలపైనే విమర్శల వర్షం కురిపించాడు మెగా బ్రదర్. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నా కూడా బయటికి వచ్చిన తర్వాత నాగబాబు చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. నిజంగానే మల్లెమాలపై ఈయన ఇంత కోపంగా ఉన్నాడా అనుకున్నారంతా. తమకు పోటీగా మొదలైన అదిరిందిపై మల్లెమాల కూడా జబర్దస్త్ పంచులు వేసింది. మీరు అలా చేస్తే మేం ఇలా చేస్తామన్నట్లుగా ఇద్దరికి ఇద్దరూ దూసుకుపోతున్నారు.

నాగబాబు రోజా ఫైల్ ఫోటోస్
అందులో భాగంగానే ఆదివారం రాత్రి 9.30 గంటలకు జీ తెలుగులో నాగబాబు అదిరింది షో ప్రసారమయ్యే సమయంలోనే.. ఈటీవీలో జబర్ధస్త్ పాత స్కిట్లను మళ్లీ వేస్తున్నారు. అందులోనూ పంచ్ డైలాగులు ఉండేలా ఎడిట్ చేస్తున్నారు. కనీసం యాడ్స్ కూడా లేకుండా అదిరింది షోపై అటాక్ మొదలు పెట్టారు మల్లెమాల టీం. అదిరింది షోలో అంతా పాత స్కిట్స్ మళ్లీ మళ్లీ ఇస్తున్నారంటూ విమర్శలు వస్తున్న వేళ.. ఈటీవీ కూడా కసి తీరా నాగబాబుపై రివర్స్ కౌంటర్స్ మొదలుపెట్టారు.

అదిరింది టీం
ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫ్రెష్ కంటెంట్ కంటే కూడా పాత కంటెంట్ అయిన జబర్దస్త్ రిపీట్ షోకే ఎక్కువ రేటింగ్ వస్తుంది. ఇక్కడ పాత కంటెంట్ కూడా దాదాపు 5 వరకు రేటింగ్ తీసుకొస్తుంటే.. అక్కడ కొత్త కామెడీ స్కిట్స్ 3 దగ్గరే ఆగిపోతుందని తెలుస్తుంది. బ్రాండ్ ఉండటంతో పాటు బెస్ట్ స్కిట్స్ సెలెక్ట్ చేసి వేస్తుండటంతో జబర్దస్త్ షోతో పోటీ పడలేకపోతుంది అదిరింది. మొత్తానికి రాబోయే కాలంలో అయినా ఈ రెండు షోల మధ్య యుద్ధ వాతావరణం తగ్గుతుందో లేదో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
January 7, 2020, 6:56 PM IST