జబర్దస్త్‌ పాలిటిక్స్‌లో రోజాదే పై చేయి...దిమ్మదిరిగే షాక్‌లో నాగబాబు‌

గతంలో జబర్దస్త్ వీడిన ధనరాజ్, షకలక శంకర్, వేణు లాంటి వాళ్లకు బయట అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లితెరపైనా పెద్దగా అవకాశాలు ఏమీ లేవు. ఒకట్రెండు సినిమాల్లో హీరో అనిపించుకున్నప్పటికీ, వాళ్ల కెరీర్ లో అవేమీ పెద్ద మార్పులు తేలేదు.

news18-telugu
Updated: November 28, 2019, 4:54 PM IST
జబర్దస్త్‌ పాలిటిక్స్‌లో రోజాదే పై చేయి...దిమ్మదిరిగే షాక్‌లో నాగబాబు‌
నాగబాబు రోజా (Source: Youtube)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో పాలిటిక్స్ మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటికే ఈ షో నుంచి బయటకు వెళ్లిపోయిన నాగబాబు, అనసూయ, చమ్మక్ చంద్ర వేరు కుంపటి పెట్టి, లోకల్ గ్యాంగ్స్ అని స్టార్ట్ చేశారు. అయితే నాగబాబు ఆ షోలోకి తనతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి పెద్ద తలకాయలను లాగి, మల్లెమాలకు షాక్ ఇవ్వాలని చూశాడు. అయితే నాగబాబుతో పాటు మరో జడ్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రోజా మాత్రం జబర్దస్త్ తోనే తన ప్రయాణమని ప్రకటించింది. అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ, నాగబాబుతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వారంతా జతకట్టి లోకల్ గ్యాంగ్స్ కార్యక్రమానికి వెళ్లిపోతారని భావించారు. అయితే వారంతా సడెన్ గా తమ నిర్ణయం మార్చుకొని జబర్దస్త్ లోనే కొనసాగుతామని ప్రకటించేశారు. దీంతో నాగబాబుకి ఒక రకంగా షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే వీరంతా జబర్దస్త్ వదిలివెళ్లకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రోజా చక్రం తిప్పారని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా గతంలో జబర్దస్త్ వీడిన ధనరాజ్, షకలక శంకర్, వేణు లాంటి వాళ్లకు బయట అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లితెరపైనా పెద్దగా అవకాశాలు ఏమీ లేవు. ఒకట్రెండు సినిమాల్లో హీరో అనిపించుకున్నప్పటికీ, వాళ్ల కెరీర్ లో అవేమీ పెద్ద మార్పులు తేలేదు. దీంతో జబర్దస్త్ లోనే కొనసాగితే బాగుండేదని, వారంతా భావించారని టాక్ వినిపిస్తోంది. అయితే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా జబర్దస్త్ వదిలి వెళితే వాళ్లలాగే అయిపోతామనే భయం ఉంది. ఆ మేరకు ఎమ్మెల్యే రోజా బ్రెయిన్ వాష్ చేసారని, దీంతో నాగబాబు వెంట నడవాలనుకున్న వారంతా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>