JABARDASTH COMEDY SHOW RAKESH MASTER WEARS SAREE IN BULLET BHASKAR SKIT GOES VIRAL PK
Jabardasth Rakesh Master: ఓరి దుర్మార్గుల్లారా.. చివరికి రాకేష్ మాస్టర్‌కు కూడా చీర కట్టించారు కదరా..!
జబర్దస్త్ రాకేష్ మాస్టర్ (Jabardasth Rakesh Master)
Jabardasth Rakesh Master: సోషల్ మీడియాలో రచ్చ చేసిన రాకేష్ మాస్టర్ (Rakesh Master)ఇప్పుడు కమెడియన్ అయిపోయాడు. జబర్దస్త్(Jabardasth Comedy Show)లో పిచ్చెక్కించే నవ్వులతో అందర్నీ మాయ చేస్తున్నాడు. ప్రతీ ఎపిసోడ్‌లోనూ వస్తూ గెస్టు నుంచి కంటెస్టెంట్‌గా మారిపోయాడు. తాజాగా ఈయన చీర కట్టుకుని చేసిన రచ్చ మామూలుగా లేదు.
2020లో రెండే బాగా ఫేమస్ అయ్యాయి. ఒకటి కరోనా వైరస్.. రెండు రాకేష్ మాస్టర్. ఈ రెండూ ఎవరి మాటా వినలేదు. యిష్టమొచ్చినట్లు రచ్చ చేసాయి 2020లో. పైగా ఈ రెండూ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు రాకేష్ మాస్టర్. ఈ మధ్య కాలంలో రాకేష్ మాస్టర్ ఎంత రచ్చ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నాడు. అందరినీ టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాడు. ముఖ్యంగా చిన్నాపెద్దా తేడా లేకుండా ఏకి పారేస్తున్నాడు. అడిగిన వాళ్లను పోరా జప్ఫా అంటూ విరుచుకుపడుతున్నాడు. శేఖర్ మాస్టర్ సహా చాలా మందిని టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసాడు రాకేష్ మాస్టర్. దాంతో ఆయన్ని పట్టించుకోవడం కూడా మానేసారు చాలా మంది. ఈ క్రమంలోనే ఈయన ఏకంగా జబర్దస్త్ కామెడీ షోలో భాగం అయిపోయాడు. అక్కడ బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తున్నాడు. ఒకటి రెండు స్కిట్స్ కాదు.. రాకేష్ మాస్టర్ ఇప్పుడు కంటెస్టెంట్ అయిపోయాడు. ఈయన్నే టార్గెట్ చేస్తూ అక్కడ అందరూ స్కిట్స్ కూడా చేస్తున్నారు.
ఆ మధ్య ఓసారి చలాకీ చంటి రాకేష్ మాస్టర్‌ను జబర్దస్త్ కామెడీ షోకు తీసుకొచ్చాడు. రాకేష్‌పై చంటి చేసిన స్కిట్ చూసి పగలబడి నవ్వుకున్నారు రోజా, మనో. చంటి మందు బాటిల్ పట్టుకుని అలా స్టేజ్‌పైకి రాగానే మనో చెవిలో రాకేష్ మాస్టర్ గురించి చెప్పింది రోజా. జబర్దస్త్ ప్రోగ్రామ్‌పై కూడా కొన్ని రోజులుగా కామెంట్ చేస్తున్నాడు రాకేష్. దాంతో జబర్దస్త్ కమెడియన్స్ కూడా రాకేష్‌ను టార్గెట్ చేసారు.
జబర్దస్త్ రాకేష్ మాస్టర్ (Jabardasth Rakesh Master)
జప్ఫా అంటూ స్కిట్ అంతా రచ్చ రచ్చ చేసాడు చలాకీ చంటి. ముఖ్యంగా భాస్కర్, సుధాకర్‌ను తిడుతూ చంటి చేసిన పర్ఫార్మెన్స్ ఫుల్లుగా వర్కవుట్ అయింది. ఏదేమైనా కూడా రాకేష్ మాస్టర్ స్పూఫ్ మాత్రం బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి రాకేష్ మాస్టర్‌పైనే స్కిట్ చేసారు భాస్కర్ టీం. అందులో ఏకంగా ఈయన చీర కట్టుకుని వచ్చాడు. అది చూసి అక్కడున్న వాళ్లే కాదు టీవీల ముందు ఉన్న వాళ్లు కూడా పగలబడి నవ్వుకున్నారు.
ఓరి దుర్మార్గుల్లారా.. చివరికి రాకేష్ మాస్టర్‌కు కూడా చీర కట్టించారు కదరా..! అంటూ ముక్కున వేలేసుకున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ అంతా చీరలు కట్టుకోవడంలో కూడా ఫేమస్సే. ఇప్పుడు రాకేష్ మాస్టర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈయనతో కూడా చీర కట్టించి పిచ్చెక్కించారు టీమ్ లీడర్స్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.