JABARDASTH COMEDY SHOW PRODUCTION HOUSE MALLEMALA WAR STILL CONTINUE WITH NAGABABU ADIRINDI PK
నాగబాబుతో జబర్దస్త్ టీం యుద్ధం.. మల్లెమాల యూటర్న్ తీసుకోదా..?
నాగబాబు (Facebook/Photo)
జబర్ధస్త్ కామెడీ షోను వదిలేసి ఇప్పుడు జీ తెలుగుతో బిజీగా ఉన్నాడు నాగబాబు. ఈయన ఏడేళ్లకు పైగా నవ్వుల నవాబుగా ఉన్నా కూడా ఎందుకో తెలియదు కానీ మల్లెమాలపైనే విమర్శల వర్షం కురిపించాడు మెగా బ్రదర్.
జబర్ధస్త్ కామెడీ షోను వదిలేసి ఇప్పుడు జీ తెలుగుతో బిజీగా ఉన్నాడు నాగబాబు. ఈయన ఏడేళ్లకు పైగా నవ్వుల నవాబుగా ఉన్నా కూడా ఎందుకో తెలియదు కానీ మల్లెమాలపైనే విమర్శల వర్షం కురిపించాడు మెగా బ్రదర్. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నా కూడా బయటికి వచ్చిన తర్వాత నాగబాబు చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. నిజంగానే మల్లెమాలపై ఈయన ఇంత కోపంగా ఉన్నాడా అనుకున్నారంతా. ఆ తర్వాత కూడా ఈయన వరసగా విమర్శలు అయితే చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు అది తారాస్థాయికి చేరిపోయింది కూడా. ప్రస్తుతం నాగబాబు జీ తెలుగులో అదిరింది కామెడీ షో చేస్తున్నాడు. ఇది కూడా జబర్దస్త్ మాదిరే ఉంది.
నాగబాబు (youtube/Photo)
అక్కడ షోను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ ఇక్కడ కూడా డిజైన్ చేసారు. సేమ్ టూ సేమ్ జబర్దస్త్ కామెడీ షోను దించేసారు జీ తెలుగు. ఇక ఈ స్కిట్స్లో కూడా కావాలనే జబర్దస్త్ కామెడీ షోను టార్గెట్ చేస్తున్నాడు నాగబాబు. అక్కడి కమెడియన్స్పై.. జడ్జిలపై కూడా సెటైర్లు పడుతున్నాయి. ఈ క్రమంలోనే జబర్ధస్త్ మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా నాగబాబుకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. మీరు అలా చేస్తే మేం ఇలా చేస్తామన్నట్లుగా ఇద్దరికి ఇద్దరూ దూసుకుపోతున్నారు.
జబర్దస్త్ కామెడీ షో
అందులో భాగంగానే ఆదివారం రాత్రి 9.30 గంటలకు జీ తెలుగులో నాగబాబు అదిరింది షో ప్రసారమయ్యే సమయంలోనే.. ఈటీవీలో జబర్ధస్త్ పాత స్కిట్లను మళ్లీ వేస్తున్నారు. అందులోనూ పంచ్ డైలాగులు ఉండేలా ఎడిట్ చేస్తున్నారు. కనీసం యాడ్స్ కూడా లేకుండా అదిరింది షోపై అటాక్ మొదలు పెట్టారు మల్లెమాల టీం. ఏదో ఒకటి రెండు వారాలు అనుకుంటే ఏమో అనుకోవచ్చు కానీ అదిరింది షో ఎన్నిరోజులు వస్తే తాము కూడా అన్ని రోజులు అదే చేస్తామన్నట్లుగా ఉందిప్పుడు వ్యవహారం. ఇంకా ప్రతివారం యాడ్స్ లేకుండా జబర్దస్త్ రిపీట్ షో చేస్తూనే ఉన్నారు. అదిరింది షోలో కొత్తదనం లేదంటూ విమర్శలు వస్తున్న వేళ.. ఈటీవీ కూడా కసి తీరా నాగబాబుపై రివర్స్ కౌంటర్స్ మొదలుపెట్టారు. మరి ఇదెక్కడ ఆగుతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.