జబర్ధస్త్‌లో ఎంట్రీ ఇస్తోన్న పటాస్ రవి.. హైపర్ ఆదికి పంచ్ ఇవ్వనున్న పటాస్ యాంకర్..

తెలుగులో జబర్ధస్త్ షోతో పాటు అంతగా పాపులర్ అయిన ప్రోగ్రాం ‘పటాస్’. ఈ టీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంకు యూత్ బాగానే కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో పటాస్ యాంకర్ రవి..హైపర్ ఆదితో కలిసి ఎంట్రీ ఇస్తున్నాడు.

news18-telugu
Updated: May 1, 2019, 7:53 PM IST
జబర్ధస్త్‌లో ఎంట్రీ ఇస్తోన్న పటాస్ రవి.. హైపర్ ఆదికి పంచ్ ఇవ్వనున్న పటాస్ యాంకర్..
యాంకర్ రవి,హైపర్ ఆది
  • Share this:
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో గురించి తెలియని అభిమానులు ఉండరు. ఇప్పటికీ  టీఆర్పీ రేటింగ్‌లో ఈ కార్యక్రమాన్ని సవాల్ చేసే ప్రోగ్రామ్ ఏది రాలేదు. కానీ తెలుగులో జబర్ధస్త్ షోతో పాటు అంతగా పాపులర్ అయిన ప్రోగ్రాం ‘పటాస్’. ఈ టీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంకు యూత్ బాగానే కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో పటాస్ యాంకర్ రవి..హైపర్ ఆదితో కలిసి ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు హైపర్ ఆదితో కలిసి ఒక స్కిట్ చేయబోతున్నాడు. ఇప్పటికే పటాస్‌లో పంచ్‌లతో అట్రాక్ట్ చేసే రవి..ఇపుడు జబర్ధస్త్ షో లోనే పంచ్‌లతో రక్తి కట్టించే హైపర్ ఆదితో చేయబోయే స్కిట్ ఎలా ఉండబోతుందో అని ఆడియన్స్ వెయిట్  చేస్తున్నారు. ఈ గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఈ వీళ్లిద్దరి స్కిట్ ఉండబోతుంది. ఈ గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో మాత్రం రోజా కాకుండా మీనా, జానీ మాస్టర్ జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. మరి పటాస్ రవితో హైపర్ ఆది పంచ్‌లు ఎలా ఉండబోతుందో చూడాలి.

First published: May 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>