జబర్దస్త్ షోలో కొత్త సందడి నెలకొంది. ముఖ్యంగా నాగబాబు ఎగ్జిట్ అయినప్పటి నుంచి ఆ ప్లేస్ లో జడ్జిగా ఎవరు వస్తారా అనే సస్పెన్స్ ఇన్ని రోజులు కొనసాగింది. అయితే ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో జడ్జ్ కనబడటంతో అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. కొన్ని ఎపిసోడ్స్ లో నరేష్, పోసాని ఇలా వరుసగా మారుతూ వస్తున్నారు. అయితే తాజాగా ప్రసారం అయిన ప్రోమోలో ఈ సారి ప్రముఖ సింగర్ మనో కనిపించారు. అయితే ఈ సారి మాత్రం జబర్దస్త్ కు ఫుల్ టైమ్ జడ్జి దొరికినట్లే అని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మనో వాయిస్ తో పాటు, హావభావాలు పలికించడంలో దిట్ట అనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే పలు టీవీ చానెల్స్ లో పాటల పోటీలు, అలాగే ఇతర రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరించిన అనుభవం ఉన్న మనో అయితే జబర్దస్త్ కు సెట్ అవుతాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో మనో ఇకపై ఫుల్ టైమ్ జడ్జిగా ఉంటాడని జబర్దస్త్ టీమ్ పండగ చేసుకుంటోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.