JABARDASTH COMEDY SHOW ONE OF THE LEADING COMEDIAN OUT OF SHOW DUE TO THIS REASONS TA
Jabardasth Comedy Show: బజర్ధస్త్ షోకు ఆ కమెడియన్ గుడ్ బై చెప్పాడా.. ఇంతకీ ఏం జరిగిందంటే..
జబర్ధస్త్ కామెడీ షో (Twitter/Photo)
Jabardasth Comedy Show: బజర్ధస్త్లో ఆ కమెడియన్‌కు నిజంగానే తొక్కేసారా.. అందుకే గత కొన్ని వారాలుగా ఈయన షోలో కనిపించడం లేదు. ఏదో పర్సనల్ కారణాలతో ఈయన ఈ షోకు హాజరు కాలేదని అందురు అనుకున్నారు.
Jabardasth Comedy Show: బజర్ధస్త్లో ఆ కమెడియన్‌కు నిజంగానే తొక్కేసారా.. అందుకే గత కొన్ని వారాలుగా ఈయన షోలో కనిపించడం లేదు. ఏదో పర్సనల్ కారణాలతో ఈయన ఈ షోకు హాజరు కాలేదని అందురు అనుకున్నారు. కానీ ఈయన మాత్రం జబర్ధస్త్ కామెడీ షోలోని రాజకీయాలతో ఈయన ఈ షో నుంచి పక్కకు తప్పుకున్నట్టు సమాచారం. ఇంతకీ జబర్ధస్త్‌లో కనిపించకుండా పోయిన ఆ కమెడియన్ ఎవరో కాదు గెటప్ శ్రీను. ఇక జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్‌లో గెటప్ శ్రీను వేసే స్కిట్స్‌కు ఆడియన్స్ ఎంతగానో నవ్వుకుంటారు. స్మాల్ స్క్రీన్ పై వీరిద్దరి జోడిగా చేసే కామెడీ ఎంతో పాపులర్ అయింది. సుడిగాలి సుధీర్ టీమ్‌లో గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ కామెడీ షోతో వచ్చిన గుర్తింపుతో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను పలు సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాల్లో వరుస ఛాన్సెస్ వచ్చినా.. గెటప్ శ్రీను తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ కామెడీ షోను మాత్రం విడిచిపెట్టలేదు. అంతేకాదు సుడిగాలి సుధీర్ టీమ్‌లో గెటప్ శ్రీను కొనసాగుతూనే ఉన్నాడు. గత కొన్ని వారాలుగా ఈయన టీమ్‌లో కనిపించపోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని వారాలుగా సుడిగాలి సుధీర్.. ఆటో రాంప్రసాద్, సన్నితోనే షోను నెట్టుకొస్తున్నాడు.
ఈ సంఘటనలతో గెటప్ శ్రీను జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం సుడిగాలి సుధీర్ కారణం అనే మాటలు కూడా వినిపించాయి. ఈ షోతో సుడిగాలి సుధీర్ కంటే గెటప్ శ్రీనుకే ఎక్కువ పేరు రావడంతో ఈయనకు తెలివిగా ఈ షోను తప్పకునేలా చేసారనే మాటలు వినిపించాయి.
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను (File/Photo)
ఈ విషయమై.. సుడిగాలి సుధీర్ టీమ్ కానీ.. గెటప్ శ్రీను మాత్రం ఎక్కడ ఏ విషయం మాట్లాడటం లేదు. అంతేకాదు గత కొన్నేళ్లుగా జబర్ధస్త్‌లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ముందు జబర్ధస్త్ షోను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ ఈ షోను విడిచి వెళ్లారు. వాళ్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఈ షోను వీడిన సంగతి తెలిసిందే కదా. ఇక చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా జబర్ధస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే కదా.
జబర్దస్త్ గెటప్ శ్రీను (jabardasth getup srinu)
మరోవైపు బిగ్‌బాస్ షో కోసం ముక్కు అవినాష్ కూడా ఈ షోను ఒదులుకున్నారు. ఈ క్రమంలో షోకు గెటప్ శ్రీను దూరమయ్యేడనే వార్తలు వచ్చాయి. ఐతే. .దీనిపై గెటప్ శ్రీను మాట్లాడుతూ.. మా టీమ్‌లో కొంత మంది కరోనా సోకడంతో నేను కొన్ని వారాలు ఈ షోను మిస్ అయ్యాను. త్వరలో ఈ షోలో మళ్లీ కలుస్తాను అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గెటప్ శ్రీను రాజు యాదవ్ అనే చేస్తున్నాడు. దాని కోసం తన లుక్ మొత్తం మార్చేసాడు. మొత్తంగా గెటప్ శ్రీను క్లారిటీ ఇవ్వడంతో తనపై జరగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పెట్టాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.