జబర్దస్త్ కామెడీ షోలో మరింత ఫన్... ఇక నవ్వులే నవ్వులు

Jabardasth Comedy Show : తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలో మరిన్ని కొత్త మార్పులు రాబోతున్నాయి. జడ్జి నాగబాబు తీసుకున్న కొత్త నిర్ణయాలు నవ్వుల పువ్వులు పూయించబోతున్నాయి.

news18-telugu
Updated: November 10, 2019, 12:00 PM IST
జబర్దస్త్ కామెడీ షోలో మరింత ఫన్... ఇక నవ్వులే నవ్వులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Jabardasth Comedy Show : మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. రోజంతా పనుల్లో పడి అలసి పోతారు. ఇలాంటి మనకు ఒకింత రిలాక్స్ కలిగించేవి కామెడీ షోలే. వాటిలో చెప్పుకోతగ్గవి గురువారం, శుక్రవారం ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలే. నిజానికి జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైన కొత్తలో... అన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్సేననీ, బూతు పురాణంలా ఉందనీ, కామెడీ కంటే... అశ్లీల పదాలు ఎక్కువగా ఉన్నాయనీ ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఐతే... ఈ విమర్శల్ని సీరియస్‌గా తీసుకున్న మల్లెమాల ప్రొడక్షన్స్... ఈ షోలో చాలా మార్పులు చేసింది. ఫలితంగా అది బాగా క్లిక్ అవ్వడంతో... ఎక్స్‌ట్రా జబర్దస్త్ కూడా తెచ్చింది. ఈ రెండు షోలకూ విపరీతమైన రేటింగ్ ఉండటమే కాదు... యూట్యూబ్‌లో కూడా లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా తమ షోలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరింత కామెడీ అందించేందుకు సిద్ధమవుతున్నారు షో నిర్వాహకులు.

ఆ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయిన జడ్జి నాగబాబు, ఎమ్మెల్యే రోజా... ఇప్పుడు పూర్తిస్థాయిలో జబర్దస్త్‌కి టైమ్ కేటాయిస్తుండటం, యాంకర్లైన అనసూయ, రష్మీ గౌతమ్ పోటీ పడి మరీ యాంకరింగ్ చేస్తుండటంతో ఈ షోలు దుమ్మురేపుతున్నాయి. ఇదే సమయంలో... మొత్తం పది టీమ్‌లూ, వాటి లీటర్లు, కంటెస్టెంట్లూ అందరూ కామెడీలో ముదిరిపోయారు. ఏం చేస్తే కామెడీ పండుతుందో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో అన్నీ నేర్చుకున్నారు. ఫలితంగా చక్కటి కామెడీ ట్రాక్ నడుస్తోంది. దీనికి తోడు... మహిళల కేరక్టర్ల విషయంలోనూ ఇదివరకటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్‌మెంట్ తెచ్చారు. అబ్బాయిలకు అదిరిపోయే కాస్ట్యూమ్స్ ఇస్తూ... రిచ్ లుక్ ఉండేలా చేశారు. ఇవన్నీ జబరస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలను ఓ రేంజ్‌లో నిలబెడుతున్నాయి.

ఇవీ కొత్త మార్పులు : ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ రెండు షోలలో... ప్రత్యేకంగా కొన్ని టీమ్‌లపై ఎక్కువ అంచనాలున్నాయి. ప్రధానంగా హైపర్ ఆది స్కిట్‌లో ఎక్కువ ఫన్ జనరేట్ అవుతోంది. అలాగే... పెద్దగా కథ లేకపోయినా... కథనాన్ని చక్కగా నడిపిస్తూ... గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ ఎప్పుడూ కామెడీలో స్టాండర్ట్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఇక చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఆడియన్స్‌ని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. మహిళా కేరక్టర్లకు ఒక్కోసారి నిజమైన మహిళలనే తెరపైకి తెస్తూ... ప్రేక్షకులకు మరింత కూల్ ఫీల్ కలిగిస్తున్నాడు. వీళ్లకు అదనంగా రాకెట్ రాఘవ... హైరేంజ్ లేదా లోరేంజ్ కాకుండా... మధ్యస్థంగా అలా అలా నడిపేస్తూ... పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రధానంగా ఈ టీమ్‌లు జబర్దస్త్‌కి మూల స్థంభాల్లా ఉన్నాయి. మిగతా టీమ్‌లు అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తూ... సపోర్టివ్‌గా ఉంటున్నాయి.

జబర్దస్త్‌కి సోషల్ మీడియాలో, టీవీల్లో పోటీ పెరుగుతుండటంతో... మరింత ఎక్కువ ఫన్ రాబట్టేందుకు జడ్జి నాగబాబు, ఎమ్మెల్యే రోజా కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేంటంటే... ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ ఇకపై... తప్పనిసరిగా 10 నిమిషాలకు తగ్గకుండా స్కిట్ చెయ్యాలనే కండీషన్ పెట్టినట్లు తెలిసింది. మిగతా టీమ్‌లు స్కిట్ డ్యూరేషన్ కాస్త తగ్గించినా పర్వాలేదు గానీ... ఈ టీమ్‌లు మాత్రం... మంచి స్కిట్ ఎంచుకొని... దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రజెంట్ చెయ్యాలనే కండీషన్ తెచ్చినట్లు సమాచారం. ఈ కంటెస్టెంట్లలో ఎవరైనా సినిమాల్లో బిజీ అయినప్పటికీ... జబర్దస్త్ కామెడీ విషయంలో మాత్రం స్టాండర్ట్స్ మెయింటేన్ చెయ్యాల్సిందేనని చెప్పినట్లు తెలిసింది. అందువల్ల ఇకపై తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షోలో... పెద్ద పెద్ద స్కిట్లు వస్తాయని అర్థమవుతోంది. అందుకు తగ్గట్టే... ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుందని భావించవచ్చు.


Pics : రియల్ లైఫ్ బార్బీ గర్ల్ అంజెలికా క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

Health Tips : వట్టి వేర్లతో ప్రయోజనమేంటి? తెలుసుకుందాం

1.2 కేజీల పీత... ఎంతకు అమ్ముడైందో తెలిస్తే షాకే...

గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్‌లో అదే చర్చ

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందు మరో 4 కేసులు...

25వేల ఉద్యోగులు... 10 కోట్ల ఫోన్లు... షామీ విజయప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్

జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...
Published by: Krishna Kumar N
First published: November 10, 2019, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading