బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో అనేది పేరు కాదు.. అదో బ్రాండ్. అందులో నటించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కామెడీ షోనే కదా అని చీప్‌గా తీసి పారేసిన వాళ్లు కూడా వామ్మో జబర్దస్త్ అంటున్నారు. అలా ఎదిగింది ఈ షో. రేటింగ్స్ పరంగా జబర్దస్త్ సృష్టించిన రికార్డులకు తిరుగులేదు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ షోకు సాధ్యం కాని రికార్డులకు తెరతీసింది ఈ షో. జబర్దస్త్ ఇంత సక్సెస్ కావడానికి కారణం స్కిట్స్‌తో పాటు జడ్జులు కూడా. నాగబాబు, రోజా లాంటి వాళ్లే ఈ షోను ఇంతగా పైకి తీసుకొచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లిద్దరూ ఉన్నపుడు షో రేసుగుర్రంగా పరుగులు తీసింది.
నాలుగు నెలల కింద ఈ షో నుంచి నాగబాబు బయటికి వచ్చేసాడు. కొన్ని రోజుల కింద జీ తెలుగుకు మకాం మార్చేసాడు మెగా బ్రదర్. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా జబర్దస్త్ కామెడీ షోకు పెద్దగా నష్టం అయితే రాలేదు. అప్పుడు ఇప్పుడు రేటింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. షోను నిలబెట్టడానికి తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఎన్ని చేసినా కూడా ఒక్క విషయంలో మాత్రం జబర్దస్త్ కామెడీ షోకు కష్టాలు తప్పడం లేదు. అదే జడ్జి విషయంలో. నాగబాబు వెళ్లిపోయిన ఇప్పటి వరకు వరకు మరో జడ్జి రాలేదు. వచ్చిన వాళ్లు రెండు మూడు వారాల కంటే ఎక్కువగా ఉండట్లేదు.
మధ్యలో చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. రోజా అయితే ఇప్పటికీ ఉంది కానీ ఆమె పక్కనే కుర్చీ మాత్రం ఖాళీగా ఉంటుంది.. మధ్యలో కొందరు వస్తున్నారు పోతున్నారు కానీ నాగబాబులా ఫిక్స్ అయ్యే వాళ్లు మాత్రం రాలేదు. అలీ రెండు ఎపిసోడ్లు మాత్రమే చేసాడు. అది కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు వచ్చాడు. కానీ జబర్దస్త్ షోకు రాలేదు. ఇక ఇప్పుడు మాత్రం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఈ రెండు షోలకు మనో జడ్జిగా ఉండబోతున్నాడు. ఇదే విషయాన్ని హైపర్ ఆది కూడా కన్ఫర్మ్ చేసాడు.
మొన్నటి వరకు జబర్దస్త్‌కు మనో వచ్చి.. ఎక్స్ ట్రా కోసం ఎవరో ఒకర్ని పట్టుకొచ్చిన మల్లెమాల ఇప్పుడు రెండింటికి ఈయన్నే కూర్చోబెట్టేసింది. ఎంతమంది వచ్చినా కూడా నాగబాబు లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది అంటున్నారు అభిమానులు. ఆయనలా షోను మళ్లీ ముందుకు తీసుకెళ్లే వాళ్లు కావాలని మల్లెమాల కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఇప్పుడు వాళ్లకు మనో దొరికాడు. అయితే ఆయన అంతగా అలరిస్తాడా అనేది చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లకు నాగబాబు పోయి.. నాగూర్ బాబు (మనో) వచ్చాడన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood