Home /News /movies /

JABARDASTH COMEDY SHOW NEW COMEDIAN EMMANUEL CREATING WONDERS WITH HIS PUNCHES PK

జబర్దస్త్‌లో ఈ చాకు లాంటి కుర్రాడు ఎక్కడ్నుంచి వచ్చాడు..?

ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)

ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షో అంటేనే చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ రోజు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న చాలా మంది కమెడియన్లకు బీజం పడింది జబర్దస్త్‌లోనే.

జబర్దస్త్ కామెడీ షో అంటేనే చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ రోజు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న చాలా మంది కమెడియన్లకు బీజం పడింది జబర్దస్త్‌లోనే. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి ఎంతోమంది నటులు ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నారంటే దానికి కారణం కూడా ఈ షోనే. ఇప్పటికీ చాలా మంది కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రమే చాలా త్వరగా పేరు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కామెడీ షో రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు మాత్రం ఓ కొత్త కమెడియన్ కనిపిస్తున్నాడు. అతడి పేరు ఎమ్మాన్యువల్. కొన్ని రోజులుగా వెంకీ మంకీస్ స్కిట్స్‌లో కనిపిస్తున్నాడు ఈయన. తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపులు చెక్కలు చేస్తున్న ఈ కుర్ర కమెడియన్ గురించి ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)


అసలెక్కడి నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. భలే చేస్తున్నాడుగా కామెడీ.. దానికితోడు పంచులు కూడా భలే వేస్తున్నాడు అంటూ ఎమ్మాన్యువల్ గురించి గూగుల్‌లో తెగ సర్చ్ చేస్తున్నారు. చేసింది తక్కువ స్కిట్స్ అయినా కూడా మనోడికి మంచి పేరే వచ్చింది. పైగా మెయిన్ స్కిట్ అంతా ఈయనే చేస్తున్నాడు. వెంకీ మంకీస్ టీం కూడా ఎమ్మాన్యువల్ బేస్ చేసుకుని స్కిట్స్ అల్లుతున్నారు. దాంతో కుర్రాడు స్పీడ్‌గానే స్టార్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈయన బ్యాగ్రౌండ్ ఏంటి.. ఎక్కడ్నుంచి వచ్చాడని ఆరా తీస్తే మల్లెమాలలోనే ఈయన కెరీర్‌కు బీజం పడిందని తెలుస్తుంది. ఈటీవీ ప్లస్‌లో వచ్చే పటాస్ షో నుంచి జబర్దస్త్ కామెడీ షోకు ప్రమోషన్ అందుకున్నాడు ఎమ్మాన్యువల్. అది క్లోజ్ చేసిన తర్వాత జబర్దస్త్‌కు పర్మినెంట్ అయిపోయాడు.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)


అక్కడ తనదైన శైలిలో స్టాండప్ కామెడీ చేయడంతో వెంకీ మంకీస్ తమ టీంలో ప్లేస్ ఇచ్చారు. వాళ్లతో పాటు మరిన్ని టీమ్స్‌లో కూడా కనిపిస్తున్నాడు ఈ కొత్త కమెడియన్. ఈ మధ్య కాలంలో జబర్దస్త్‌లో అంత త్వరగా పేరు తెచ్చుకున్న కొత్త వాళ్లెవ్వరూ లేరు.. ఒక్క ఎమ్మాన్యువల్ తప్ప. అందుకే మనోడిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మిగిలిన టీం లీడర్స్ కూడా. అదృష్టం బాగుంటే త్వరలోనే హైపర్ ఆదిలా టీం లీడర్ అయిపోయి సెటైర్ల వర్షం కురిపిస్తాడేమో ఎవరికి ఎరుక..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు