హైపర్ ఆదికి షాక్... నాగబాబు స్వీట్ వార్నింగ్

ఆది, నాగబాబు

Jabardasth Comedy Show : జబర్దస్త్ కామెడీ షోలో... కామెడీ హై-పిచ్‌కి వెళ్లేది హైపర్ ఆది స్కిట్‌లోనే. మరి ఆదికి నాగబాబు వార్నింగ్ ఎందుకిచ్చారు? అసలేం జరిగింది?

 • Share this:
  Jabardasth Comedy Show : ప్రస్తుతం తెలుగు టీవీ తెరపై... కామెడీని ఓ రేంజ్‌లో పండిస్తున్న షోల్లో జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలది ప్రత్యేక స్థానం. గురు, శుక్రవారాల్లో ఈ షోలు వస్తున్నాయంటే చాలు... తెలుగు ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. అదే హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు... పంచుల ప్రవాహం కోసం ఆసక్తిగా చూస్తారు. ఇళ్లలోనే కాదు... టాలీవుడ్ వర్గాల్లో కూడా హైపర్ ఆది స్కిట్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఏమాత్రం తటపటాయించకుండా పంచులు వెయ్యడం, రిటైర్‌మెంట్లు లేని సెటైర్లు వెయ్యడం. వీటికి తోడు హైపర్ ఆది స్కిట్‌లలో ఎక్కువగా డబుల్ మీనింగ్స్ ఉండకపోవడం కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆ స్కిట్ బాగా ఆకర్షిస్తోందని చెప్పుకోవచ్చు.

  జబర్దస్త్ కామెడీ షోకి కావాల్సింది నీట్ కామెడీ. ఆ విషయంలో హైపర్ ఆదికి తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. స్కిట్‌లో ఎక్కడా గందరగోళం ఉండకూడదు. ఆ విషయంలో కూడా హైపర్ ఆది ఏమాత్రం రాజీ పడడు. స్కిట్‌లో కొత్తదనం చూపించడంలోనూ చెలరేగిపోతున్నాడు. ఈ మధ్య ఏకంగా ఫేమస్ పర్సనాల్టీల్లో పరకాయప్రవేశం చేస్తూ... దుమ్మురేపుతున్నాడు. అతని టీమ్ కూడా అలాగే తయారైంది. స్పాంటేనియస్‌గా ఆది నుంచీ వచ్చే డైలాగ్స్ ప్రవాహానికి అంతే స్పాంటేనియస్‌గా స్పందిస్తూ.... నవ్వుల పువ్వులు కురిపిస్తోంది. మరి అంతా బాగుంటే... జబర్దస్త్ కామెడీ షోలో కీలకమైన జడ్జి నాగబాబు ఎందుకు ఆదికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు? అసలేం జరిగింది?

  అదే సమస్య : మిగతా స్కిట్లలో కామెడీ పండాలంటే... నటన, హావభావాలకు ప్రాధాన్యం ఉంటోంది. ప్రేక్షకులు కూడా ఇతర స్కిట్ల నుంచీ పంచుల కంటే పెర్ఫార్మెన్స్ వెతుక్కుంటున్నారు. ఆది స్కిట్ల విషయంలో మాత్రం పెర్ఫార్మెన్స్ కంటే... పంచులు ఏం వేస్తున్నాడా అని తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఐతే... ఇటీవల ఆది దూకుడు మరీ ఎక్కువైపోయింది. గ్యాప్ లేకుండా పంచులపై పంచులు వేసేస్తున్నాడు. ఒక పంచ్ వేశాక, అదేంటని గ్రహించి, అర్థం చేసుకొని, దానికి నవ్వుకునే లోపే... మరో రెండు మూడు పంచులు పడిపోతున్నాయి. దాంతో నవ్వే గ్యాప్ కూడా ప్రేక్షకులకు దొరకట్లేదు. చివరకు మరీ ఇంత స్పీడ్ అవసరమా అనే పరిస్థితి వచ్చేస్తోంది. నవ్వే గ్యాప్ కూడా ఇవ్వట్లేదని జబర్దస్త్ కామెడీ షోలోని మరో జడ్జి అయిన రోజా చెప్పిన సందర్భాలెన్నో. ఈ విషయాన్ని గ్రహించిన నాగబాబు... స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మరీ అంత వేగం వద్దనీ... పంచులు, డైలాగ్స్ మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చూడాలని సూచించినట్లు తెలిసింది.

  అదే ప్లస్ అదే మైనస్ : హైపర్ ఆదికి తెలుగు భాషపై మంచి పట్టుంది. పల్లెల్లో ప్రజలు మాట్లాడుకునే డైలాగ్స్, యాస అన్నీ అతనికి వెన్నతో పెట్టిన విద్య అయ్యాయి. దానికి తోడు... ప్రతి విషయాన్నీ సెటైరికల్‌గా మాట్లాడటం ఆదికి అలవాటైంది. ఇందులో కాస్త కామెడీ రూట్ వెతుక్కున్న ఆది... స్టేజ్ ఎక్కగానే... పంచుల ప్రవాహం సాగిస్తున్నాడు. ఈ పంచులు జనానికి అర్థం కానప్పుడు... అర్థం చేసుకునే టైమ్ ఇవ్వనప్పుడు ఎన్ని వేసినా వేస్టే అనే భావన వస్తోంది. అందుకే ఇకపై హైపర్ ఆది స్కిట్లలో పంచుల వేగం కాస్త తగ్గిస్తాడని తెలిసింది. వేగం తగ్గినా... వేసే విషయంలో మాత్రం వెనక్కి తగ్గడని సమాచారం.

   

  Pics : పింక్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్
  ఇవి కూడా చదవండి :

  HBD Sania : సానియా మీర్జా బర్త్‌డేకి ఉపాసన స్వీట్ విషెస్

  పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణం ఇదేనా?

  Inspiration : దేశపు మొదటి మహిళా చాకొలెట్ టేస్టర్ పూనం కార్డియా


  Pics : వెల్వెట్ లెహంగాలో తళుక్కుమన్న ప్రియమణి


  Diabetes : డయాబెటిస్ వేధిస్తోందా... ఈ సలాడ్ తీసుకోండి...
  Published by:Krishna Kumar N
  First published: