జబర్దస్త్‌ను వదలని నాగబాబు.. రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు

జబర్దస్త్ నా ప్రోగ్రాం అనుకొని చేశానని.. ఏమైనా తప్పులు జరిగినా ఓపెన్‌గా వెళ్లేవాళ్లమని చెప్పారు నాగబాబు. ఓడిపోయిన టీమ్ లీడర్స్ ఒక్కోసారి డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయే వారన్న నాగబాబు... ఆ సమయంలో మానసికంగా ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేలా కృషి చేశామని చెప్పారు.

news18-telugu
Updated: November 28, 2019, 9:21 PM IST
జబర్దస్త్‌ను వదలని నాగబాబు.. రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జబర్దస్త్ షో నుంచి 2 వారాల కిందే వెళ్లిపోయారు నాగబాబు. జీ తెలుగులో ప్రసారమవుతున్న లోకల్ గ్యాంగ్స్‌లో చేరిపోయారు. ఐతే షో నుంచి వెళ్లిపోయినప్పటికీ జబర్దస్త్ జ్ఞాపకాలను మాత్రం పదిలంగా దాచుకున్నారు. ఆ షోను ఇంకా మరలేకపోతున్నారు. అందుకే జబర్దస్త్‌లో తనకు ఎదురైన అనుభవాలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు. జబర్దస్త్ తెర వెనక ఉన్న కష్టా సుఖాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే రెండు వీడియోలను రిలీజ్ చేసిన నాగబాబు.. జబర్దస్త్ షోకు సంబంధించిన మరో వీడియోను గురువారం విడుదల చేశారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రారంభం, రచ్చ రవి యాక్సిడెంట్ గురించి అందులో వెల్లడించారు.

జబర్దస్త్ సక్సెస్ కావడంతో మరో షోను ప్లాన్ చేద్దామని నిర్మాతలు అనుకున్నారని నాగాబాబు తెలిపారు. కానీ రెండో రోజు కూడా జనాలు చూస్తారా అని జడ్జి రోజాతో పాటు షో డైరెక్టర్లలో డైలమా ఉండేదని చెప్పారు. ఐతే తనకు మాత్రం వెరీగుడ్ అనిపించిందని.. జనాలు ఖచ్చితంగా చూస్తారని నిర్మాతలకు సూచించానని చెప్పారు. మనల్ని నవ్వించేవారుంటే ఎన్ని రోజులైనా నవ్వుతామని తెలిపారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ముందుకు వెళ్లడానికి నిర్మాతగా శ్యామ్ ప్రసాద్, ఈటీవీ‌ కారణమన్న నాగబాబు.. ఆ షో సక్సెస్ అవుతుందని విశ్వసించిన వారిలో తానూ ఒకరినని చెప్పారు.

రచ్చ రవికి యాక్సిడెంట్ అయితే అపోలోలో చికిత్స చేయించారు. తాను చెబితే మంచి ట్రీట్‌మెంట్ ఇస్తారని కోరడంతో నేను ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడా. నేను చెప్పకున్నా అపోలోలో మంచి ట్రీట్‌మెంటే ఇస్తారు. ఆ సమయంలో రచ్చ రవి తల్లిదండ్రులకు కొంత ఆర్థిక సాయం చేశా. జబర్దస్త్‌లో అందరం ఐక్యమత్యంగా కుటుంబంగా ఉన్నాం. కష్టసుఖాలను పంచుకున్నాం.
నాగబాబు


జబర్దస్త్ నా ప్రోగ్రాం అనుకొని చేశానని.. ఏమైనా తప్పులు జరిగినా ఓపెన్‌గా వెళ్లేవాళ్లమని చెప్పారు నాగబాబు. ఓడిపోయిన టీమ్ లీడర్స్ ఒక్కోసారి డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయే వారన్న నాగబాబు... ఆ సమయంలో మానసికంగా ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేలా కృషి చేశామని చెప్పారు. 25 ఎపిసోడ్‌లతో ఆగిపోవాల్సిందని.. కానీ సక్సెస్ వల్లే ఇన్ని రోజులు కొనసాగిందని చెప్పారు. దీని వెనక సంజీవి, నితిన్, భరత్‌తో పాటు కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కృషి ఎంతాగానో ఉందని కొనియాడారు.నాగబాబు వీడియో ఇక్కడ చూడండి:
First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>