జబర్దస్త్‌లో రోజాకు ఝలక్ ఇచ్చిన మల్లెమాల...రంగంలోకి బీజేపీ నేత...

ఎమ్మెల్యే రోజా తరహాలోనే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో పాటు.. జాతీయ స్థాయి పార్టీ తరపున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది.

news18-telugu
Updated: February 10, 2020, 12:16 PM IST
జబర్దస్త్‌లో రోజాకు ఝలక్ ఇచ్చిన మల్లెమాల...రంగంలోకి బీజేపీ నేత...
నటి రోజా
  • Share this:
ఎమ్మెల్యే నటి రోజా సెల్వమణి తన అందచందాలతోనే కాదు నికార్సయిన జడ్జిమెంట్ ద్వారా జబర్దస్త్(Jabardasth) కు కొత్త క్రేజ్ తెచ్చిపెట్టింది. ఒక దశలో తాను ఎమ్మెల్యేగా గెలవడంలో జబర్దస్త్ పాత్ర కూడా ఉందని ఆమె గుర్తు చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రొగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న రోజా మధ్యలో ఒకట్రెండు సార్లు అన్ని ప్రతీ సారి జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా జబర్దస్త్ లోనే ఆమె కొనసాగుతున్నారు. అయితే ఇటీవల నాగబాబు మల్లెమాలకు గుడ్ బై చెప్పినప్పటికీ, రోజా మాత్రం ఏమాత్రం వేరే నిర్ణయం తీసుకోకుండా కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్యే రోజాకు అనుకోని షాక్ ఎదురు కానున్నట్లు సమాచారం వస్తోంది. ఇంతకాలం రోజాకు పోటీగా జబర్దస్త్ లో మరో జడ్జి ఎవరూ నిలదొక్కుకోలేక పోయారు. మధ్యలో ఒకసారి నటి మీనా ఎంట్రీ ఇచ్చినా ఒకట్రెండు ఎపిసోడ్లకే పరిమితమైంది. అయితే తాజాగా ఎమ్మెల్యే రోజా జడ్జి స్థాానానికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మల్లెమాల సంస్థ అందుకు తగ్గట్టుగానే షాక్ ఇచ్చింది.

తాజాగా హైపర్ ఆది స్కిట్ ద్వారా మరో టాలివుడ్ హీరోయిన్ ఎంట్రీ చేసింది. ఆమె మరెవరో కాదు. నచ్చావులే సినిమా ద్వారా అభిమానులను సంపాదించుకున్న నటి మాధవీలత కావడం విశేషం. నటి మాధవీ లత ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే రోజా తరహాలోనే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో పాటు.. జాతీయ స్థాయి పార్టీ తరపున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే మాధవీలతను అనసూయకు ఝలక్ ఇచ్చేందుకు తెచ్చారా...లేక రోజాకు ఝలక్ ఇచ్చేందుకు ప్రవేశ పెట్టారా అనేది తేలాల్సి ఉంది.

రోజా, మాధవీలత


First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు