జబర్దస్త్‌ షోలో నాగబాబు ప్లేస్‌‌ను రీప్లేస్ చేసేది వీరే..

తాజాగా నాగబాబు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో నుంచి పక్కకు తప్పుకోవడంతో ఆయన ప్లేస్‌లో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీనటులను రంగంలో దింపేందుకు జబర్దస్త్ షో నిర్వాహకులు రంగం సిద్దం చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: November 18, 2019, 7:44 PM IST
జబర్దస్త్‌ షోలో నాగబాబు ప్లేస్‌‌ను రీప్లేస్ చేసేది వీరే..
నాగబాబు న్యూలుక్ (Whatssup/Image)
  • Share this:
నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. ఇక జబర్థస్త్ షోలో నాగబాబు నవ్వుల కోసమే ఈ షో చూసే వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ షోతో మెగా బ్రదర్.. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా జబర్ధస్త్ షో అంటే కామెడీతో పాటు రోజా, నాగబాబు నవ్వులతో నపాటు వాళ్లు జడ్జ్‌మెంట్. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ నాగబాబు, రోజా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు కాస్త విరామిచ్చారు. నాగబాబు.. తన తమ్ముడు జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా  పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో నాగబాబు విజయం సాధించలేదు. దీంతో యదావిధిగా జబర్ధస్త్ జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా.. రాజకీయాలే తన ప్రాధాన్యం అని చెప్పుకున్నారు. తాజాగా నాగబాబు...ఈ టీవీలో ప్రసారమయ్యే ఈ షో నుంచి పక్కకు తప్పుకొని జీ తెలుగులో ప్రసారమయ్యే కొత్త షోతో తన కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు. ఈ షో కోసం జబర్ధస్త్ షో నుంచి మూడు నాలుగు టీమ్స్‌ను జీ తెలుగుకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ షోలో నాగబాబు ప్లేస్‌ను సాయి కుమార్, ఆలీ, బండ్ల గణేష్‌లతో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారని సమాచారం.

jabardasth comedy show judge nagababu replaced by these tollywood stars,Nagababu,Nagababu jabardasth comedy show,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,nagababu facebook,nagababu Election Affidavit,Nagababu Assets,How much nagababu assets value,jabardasth comedy show,Andhra Pradesh news,Andhra Pradesh politics,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,Nagababu Narsapuram MP,Nagababu Narsapuram Lok Sabha Seat,Rashmi gautham,anasuya,nagababu janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,నాగబాబు ఆస్తులు,నాగబాబు ఆస్తుల వివారాలు,నాగబాబు ఎన్నికల అఫిడవిట్,జబర్థస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నరసాపురం ఎంపీ టికెట్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు ఆస్తులు,నాగబాబు అప్పులు,నాగబాబు నిర్మాత,నాగబాబు ఆస్తులు అప్పులు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,నాగబాబు ఆస్తులు, నాగబాబు అప్పులు,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
జబర్ధస్త్ ప్లేస్‌లో సాయి కుమార్,ఆలీ,బండ్ల గణేష్ (Facebook/Photo)


ముఖ్యంగా  గురువారం ప్రసారమయ్యే కామెడీ షోకు సాయి కుమార్‌ను, శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌కు ఆలీని అనుకుంటున్నారు. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారు జబర్ధస్త్ షో నిర్వాహకులు. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే సాయి కుమార్ ఈటీవీలో ప్రసారమయ్యేు పలు రియాల్టీ షోలకు యాంకర్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆలీ కూడా ఆలీతో జాలీగా వంటి ఇంటర్వ్యూలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులతో అతనికి కూడా పరిచయం ఉంది. ఇక ఇప్పటి వరకు టీవీ ప్రేక్షకులతో సంబంధం లేని బండ్ల గణేష్ ఈ ప్రోగ్రామ్‌ను ఎలా రన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏమైనా నాగబాబు లేని జబర్దస్త్ షోను ఈ ముగ్గురు తమదైన జడ్జిమెంట్‌తో ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి.
First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading