హైపర్ ఆది పంచ్‌లకు రోజా బ్రేకులు వేస్తుందా.. ఇంతకీ ఏం జరిగిందంటే..

హైపర్ ఆది రోజా ఫైల్ ఫోటోస్

జబర్దస్త్ జడ్జ్ కమ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉంటే అవతల ఎంతటి వాళ్లకైనా హడల్. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది. తాజాగా రోజాపై ఓ ప్రోగ్రామ్ సాక్షిగా మంచి పంచ్‌లే విసిరాడు. దానికి రోజా ఎలా బ్రేకులు వేసిందంటే..

  • Share this:
    జబర్దస్త్ జడ్జ్ కమ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉంటే అవతల ఎంతటి వాళ్లకైనా హడల్. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది. అలాంటి రోజా న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే’ అనే ప్రోగ్రామ్ చేసింది. రీసెంట్‌గా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల వాళ్లు రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోమోలో రోజాతో పాటు హైపర్ ఆది, మరో యాంకర్  వర్షిణి ఉన్నారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరు ఒకరిపై మరోకరు నవ్వులు పూయించుకున్నారు. ఆ తర్వాత రోజా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  రోజా.. హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ.. ఇతడు పనోడు అంటూనే  ప్రెస్ మీట్ పెట్టమని హైపర్ ఆదికి ఆర్డర్ పాస్ చేసింది.  కానీ హైపర్ ఆది మాత్రం.. ఇది మీరనకున్న పార్టీ కాదు.. ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు అని చెప్పి పంచ్ వేయడంతో అవాక్కవడం రోజా వంతు అయింది. దీనికి రోజా ఏ రకంగా ప్రతీకారం తీర్చుకుంటుందో తెలియాలంటే  ఈ రోజు రాత్రి ఈటీవీలో ప్రసారం కానున్న ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే ప్రోగ్రామ్ చూడాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: