నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా.. జబర్దస్త్ షోతో పెరిగిన మెగా బ్రదర్ అస్సెట్స్..

news18-telugu
Updated: November 6, 2019, 10:28 AM IST
నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా.. జబర్దస్త్ షోతో పెరిగిన మెగా బ్రదర్ అస్సెట్స్..
నటుడు నాగబాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు.నటుడిగా నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. లక్ కలిసిరాదు. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించాడు. కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రం కాస్తా పర్వాలేదనిపించింది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇంట్లో మెగా హిట్టు ఇచ్చే హీరోలు ఉన్న వారితో హిట్ సినిమాలు నిర్మించలేకపోవడం నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.

Is Mega Family not suituble for Politics and What About Ram Charan,pawan kalyan,pawan kalyan kalyan shows no effect in andhra pradesh,chiranjeevi,andhra pradesh news,andhra pradesh politics,pawan kalyan kalyan shows no effect in andhra pradesh Assembly lok sabha Elections,andhra pradesh news,prajarajyam,praja rajyam chiranjeevi,janasena chief pawan kalyan trailing,pawan kalyan no effect in ap elections,prakash raj trailing,election results 2019,live election result 2019,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan craze,pawan kalyan fires on jagan,pawan kalyan janasena,pawan kalyan fans,pawan kalyan politics,pawan kalyan press meet,pawan kalyan public meeting,janasena pawan kalyan,janasena,pawan kalyan's jana sena,pawan kalyan jana sena party,janasena party,pawan kalyan janasena press meet,pawan kalyan janasena manifesto 2019,పవన్ కళ్యాణ్ వెనకంజ,భీమవరం,భీమవరం పవన్ కళ్యాణ్ ఏపీ లో జనసేన ప్రభావం శూన్యం,జనసేనతో పవన్ కళ్యాణ్,జనసేన,ప్రజా రాజ్యం,ప్రజా రాజ్యం చిరంజీవి,
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్


ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో నాగబాబు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరుపున రాజకీయాల్లో ప్రవేశించాడు. అంతేకాదు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో నాగబాబు..ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసినపుడు నాగబాబు..  ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు, తన భార్యకు కలిపి రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు. ఇందులో వాహనాలు వంటి చరాస్థులు రూ.36.73 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక  స్థిరాస్థుల విషయానికొస్తే  రూ.4.22 కోట్లుగా  చూపించారు. దీంతో పాటు రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు చూపించారు. మొత్తంగా చూస్తే.. నికరంగా రూ.38 కోట్లు ఆస్తులున్నాయి. అదే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే.. రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 6, 2019, 10:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading