ఎటూ తేల్చుకోలేకపోతున్న రోజా.. జగన్ అనుమతి కోసం వెయిటింగ్..
సినిమాల్లో హీరోయిన్గా పీక్ స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. తాజాగా రోజా.. ఓ విషయమై ఎటూ తేల్చుకోలేపోతుందట.
news18-telugu
Updated: December 4, 2019, 3:03 PM IST

రోజా, వైఎస్ జగన్
- News18 Telugu
- Last Updated: December 4, 2019, 3:03 PM IST
సినిమాల్లో హీరోయిన్గా పీక్ స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది. ఆ తర్వాత వై.యస్.జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్సీపీలో జాయిన్ అయింది. గత ఎన్నికల్లో నగరి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది.ఒకవైపు రాజకీయాల్లోకి ఉంటూనే మరోవైపు సినిమాలు, జబర్థస్త్ వంటి కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగానే కాకుండా .. ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా రోజా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమలో రోజా..పవుర్ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను రోజాను సంప్రదించి సినిమాలో ఆమె పాత్ర గురించి వివరణ ఇచ్చినట్టు సమాచారం. రోజా కూడా వైరీ పక్షం పార్టీ లీడరైన బాలయ్య సినిమాలో ఈ పాత్ర చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరు కలిసి ఏడు సినిమాల్లో జోడిగా నటించారు. ఆ తర్వాత బాలయ్య హీరోగా నటించిన ‘పరమ వీరచక్ర’, శ్రీరామరాజ్యం’ సినిమాల్లో రోజా గెస్ట్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ రోజా చేస్తేనే బాగుంటుందని బాలయ్య, బోయపాటి శ్రీనులు భావిస్తున్నారు. ఇప్పటికే రోజా కూడా బాలయ్య సినిమాలో పాత్ర చేయబోతున్నట్టు ఏపీ సీఎం జగన్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. జగన్ మాత్రం జబర్ధస్త్ వంటి షోలు చేయడానికి అనుమతి ఇచ్చినా.. సినిమాల్లో రోజా ఎంట్రీ పై మాత్రం జగన్ మాత్రం నోరు విప్పడం లేదంట. దీంతో రోజా... బాలయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఉన్నా.. జగన్ అనుమతి కోసం వేచిచూస్తున్నట్టు సమాచారం. ఏమైనా ఈ విషయమై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

బాలయ్య రోజా ఫైల్ ఫోటోస్

Loading...