Jabardasth Comesy Show | వారం వారం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్ కూడా భారీ టీఆర్ఫీ రేటింగ్ అందుకుంటూ ప్రేక్షక లోకానికి వినోదాల విందిస్తున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు ఈ నవ్వుల హంగామా తాలూకు ప్రోమో వీడియోలు వదులుతూ షో పట్ల ఆసక్తి పెంచేస్తోంది మల్లెమాల టీమ్. ఈ క్రమంలోనే తాజాగా వదిలిన ప్రోమో వీడియోలో ఏకంగా షోపైనే సెటైర్స్ వేస్తూ తెగ హంగామా చేశాడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్. గత కొన్నేళ్లుగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది జబర్దస్త్ కామెడీ షో. ఆదిలోనే ఈ షోకి భారీ ఆదరణ లభించడంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అనే రెండు వేర్వేరు ప్రదర్శనలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ప్లాన్ చేశారు మేకర్స్. వారం వారం ఈ రెండు షోస్ కూడా భారీ టీఆర్ఫీ రేటింగ్ అందుకుంటూ వినోదాల విందిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఈ నవ్వుల హంగామా తాలూకు ప్రోమో వీడియోలు వదులుతూ షో పట్ల ఆసక్తి పెంచేస్తోంది మల్లెమాల టీమ్. ఈ క్రమంలోనే తాజాగా వదిలిన ప్రోమో వీడియోలో ఏకంగా షోపైనే సెటైర్స్ వేస్తూ తెగ హంగామా చేసి ఆశ్చర్యపరిచాడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్.
ఎప్పటిలాగే వర్ష జోడీగా జబర్దస్త్ వేదికపైకి వచ్చిన ఇమ్మాన్యుయేల్ ఆమె అందం, రూపురేఖలపై పంచ్ డైలాగ్స్ విసిరాడు. 'మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది' అంటూ రాజశేఖర్ రొమాంటిక్ పాటతో వర్షతో కలిసి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్.. రావడం రావడమే వర్షను ఓ ఆట ఆడేసుకున్నాడు. ముంబై వెళ్లి నీ ముఖానికి సర్జరీ చేయించుకో అంటూ ఆమె అందంపై జబర్దస్త్ పంచ్ విసిరాడు.
దీంతో జడ్జ్ స్థానంలో కూర్చున్న ఇంద్రజ, పూర్ణ ఏయ్ అంటూ ఇమ్మాన్యుయేల్‌ని మందలించబోయారు. ఇది గ్రహించిన ఇమ్మూ.. ఏందయ్యా ఇది! మొత్తం అంతా మహిళలే ఉన్నారిక్కడ. కాస్త మనో గారిని తీసుకురండి మీ దండం పెడతా అంటూ ఓపెన్ అయ్యాడు. దీంతో జడ్జెస్ పూర్ణ, ఇంద్రజ సహా ఆంచారు రష్మీ తెగ నవ్వేశారు.
గతంలో జబర్దస్త్ జడ్జ్‌లుగా రోజా, నాగబాబు లాంగ్ జర్నీ చేసి షో సక్సెస్‌లో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల జడ్జ్‌గా నాగబాబు వైదొలగడంతో రోజా సింగిల్‌గా హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత సింగర్ మనో ఎంట్రీ ఇచ్చి నాగబాబు స్థానాన్ని రీ ప్లేస్ చేస్తూ ప్రేక్షక మన్ననలు పొందుతున్నారు. ఇంతలో రోజాకు మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్‌కి ఆమె గుడ్ బై చెప్పడం, రోజా స్థానంలో ఇంద్రజ జడ్జ్‌గా వ్యవహరించడం చూస్తున్నాం. అయితే తాజా ఎపిసోడ్లో మాత్రం మనో కూడా కనిపించక పోవడం, ఆయన స్థానంలో పూర్ణ దర్శనమివ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. పైగా 'అందరూ ఆడవాళ్లేనా..' అంటూ జబర్దస్త్ వేదికపైనే ఇమ్మూ ఓపెన్ కావడం ఆ అనుమానాలకు రెక్కలు కట్టింది. సో.. చూడాలి మరి మనో కూడా జబర్దస్త్ వీడబోతున్నారా? లేక ఏదైనా ప్రొఫెషనల్ వర్క్ రీత్యా కొన్ని ఎపిసోడ్స్‌కి దూరంగా ఉంటారా? అనేది.
(News18 : Sunil )
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.