Home /News /movies /

JABARDASTH COMEDY SHOW HYPER AADI TEAM ONE OF THE MEMBERS GOT CORONA POSITIVE SHOOTING WILL DELAY TA

జబర్ధస్త్ హైపర్ ఆది టీమ్‌లో కరోనా కలకలం.. జబర్ధస్త్ షూటింగ్ పై అనుమానాలు..

‘హైపర్ ఆది’ (Facebook/Photo)

‘హైపర్ ఆది’ (Facebook/Photo)

ఇందు గలడు అందు లేడు అనే సందేహం వలదు.. అని పోతన భాగవతంలో చెప్పినట్టు.. ఇపుడు కరోనా సర్వత్రా వ్యాప్తి అయిపోయింది. పేదా, గొప్ప, ఆడా ,మగా  తేడా లేకుండా అన్ని చోట్ల చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జబర్థస్త్‌లోని హైపర్ ఆది టీమ్‌లో కరోనా కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...
    ఇందు గలడు అందు లేడు అనే సందేహం వలదు.. అని పోతన భాగవతంలో చెప్పినట్టు.. ఇపుడు కరోనా సర్వత్రా వ్యాప్తి అయిపోయింది. పేదా, గొప్ప, ఆడా ,మగా  తేడా లేకుండా అన్ని చోట్ల చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం కరోనా ఎపుడు ఎవరిని ఎలా కబలిస్తుందో చెప్పడం కాస్త కష్టమే అని చెబుతున్నారు. సమాజంలో ఉన్న రోజు కూలీ దగ్గర నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వరకు అందిరినీ ఈ మహామ్మారి వదలడం లేదు. ఇప్పటికే సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్స్‌కు ఇవ్వడంతో ఇప్పటికే కొన్ని సినిమా, టీవీ షూటింగ్స్ స్టార్ట్ కూడా అయ్యాయి. అందులో జబర్ధస్త్ కూడా ఉంది. ఇప్పటికే జబర్ధస్త్‌ రెండు వారాలకు చెందిన ఎసిపోడ్స్ ప్రసారం అయ్యాయి. తాజాగా జబర్ధస్త్ టీమ్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటికే హైపర్ ఆది టీమ్‌లో ఒక మెంబర్‌కు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి.

    జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది
    జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది


    మొన్నటి ఎసిపోడ్ తర్వాత హైపర్ ఆది టీమ్‌లోని ఒక మెంబర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోతే.. టెస్ట్ చేయిస్తే.. పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో హైపర్ ఆది టీమ్‌లోని  మెంబర్స్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అంతేకాదు హైపర్ ఆదితో పాటు మిగిలిన టీమ్ మెంబర్స్ అందరూ కరోనా టెస్టులు చేయించుకున్నట్టు సమాచారం.ఇప్పటికే జబర్ధస్త్ మల్లెమాల వాళ్లు..  ఎందుకైనా మంచిదని ఒకేసారి నాలుగైదు వారాలకు చెందిన ఎపిసోడ్స్ షూట్ చేసి పెట్టుకున్నారు. హైపర్ ఆది టీమ్ మెంబర్స్ ఇంకా 14 రోజల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా జబర్ధస్త్ కామెడీ షోకు ఇపుడు కరోనా రూపంలో పెద్ద గండమే వచ్చి పడింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Coronavirus, Covid-19, Hyper Aadi, Jabardasth comedy show, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు