Home /News /movies /

JABARDASTH COMEDY SHOW HYPER AADI COMMENTS ON AUTO RAMPRASAD SKITS BS

Jabardasth: ఆటో రాంప్రసాద్ స్కిట్లపై హైపర్ ఆది సంచలన కామెంట్స్..

జబర్దస్త్ కామెడీ షోలో ఓ సన్నివేశం

జబర్దస్త్ కామెడీ షోలో ఓ సన్నివేశం

Jabardasth | జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది స్కిట్స్ ప్రత్యేకం. అతడు వేసే పంచ్‌లు, ప్రాసలకు జడ్జిలు నాగబాబు, రోజా సైతం పగలబడి నవ్వుకుంటారు. ఎంత నవ్విస్తాడో, అంతే త్వరగా వివాదాల్లోనూ ఉంటాడు.

    వారం వారం ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న కామెడీ షో.. జబర్దస్త్. చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలివాళ్ల వరకు ఎందరో అభిమానులు ఉన్నారు. గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అందులో చాలా మంది ఈ కామెడీ షో యాంకర్స్ అనసూయ, రష్మీ కోసమే చాలా మంది ఈ షో చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇక, ఈ కామెడీ షోలో టీమ్ లీడర్లకు ఒక్కో వెరైటీ పేరు. అంతేకాదు.. నవ్వులు పూయించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, హైపర్ ఆది.. ఇలా ఆయా టీమ్‌లు జబర్దస్త్‌తోనే కాదు ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీని ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే, అందరిలోనూ హైపర్ ఆది స్కిట్స్ ప్రత్యేకం. అతడు వేసే పంచ్‌లు, ప్రాసలకు జడ్జిలు నాగబాబు, రోజా సైతం పగలబడి నవ్వుకుంటారు. ఎంత నవ్విస్తాడో, అంతే త్వరగా వివాదాల్లోనూ ఉంటాడు. అంతకుముందు కామెడీ స్కిట్‌లో భాగంగా రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు, ఆ తర్వాత షోలో దేశంలోని స్త్రీలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచాడు.

    అయితే, తాజాగా.. వచ్చే వారానికి సంబంధించిన హైపర్ ఆది స్కిట్ ప్రోమోను విడుదల చేశారు. అందులో ఆదితో పాటు, ఆటో పంచ్‌లు వేసే రాంప్రసాద్ కూడా ఓ పాత్ర వేశాడు. అందులో భాగంగా.. తాను చెప్పిందే నువ్వు తిరిగి తిరిగి చెబుతున్నావని రాంప్రసాద్ అనగా.. మరి ఏడేళ్ల నుంచి నువ్వు కూడా తిప్పి తిప్పి అవే స్కిట్‌లు వేస్తున్నావ్‌గా అని అంటాడు. దీంతో రాంప్రసాద్‌ సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఆ వెంటనే నాగబాబు, రోజా నవ్వడంతో కథ ముందుకు సాగుతుంది. ఇలా చాలా సందర్భాల్లో వేరే వాళ్ల స్కిట్లపై హైపర్ ఆది వెరైటీ వ్యాఖ్యలు చేశాడు. తన నోటిదురుసుతనంతో వేరే వాళ్ల స్కిట్లను హేలన చేయడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రేక్షకులు హైపర్ ఆదిని ప్రశ్నిస్తున్నారు.

    First published:

    Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు