JABARDASTH COMEDY SHOW FAME PRIYANKA SINGH REQUESTS IN SOCIAL MEDIA TO NOT POST VULGAR COMMENTS PK
జబర్దస్త్ నటిపై అసభ్య పదజాలం.. అర్థం చేసుకోవాలని విన్నపం..
సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్
జబర్దస్త్ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్ పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు.
జబర్దస్త్ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్ పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు. కానీ ఇప్పుడు అతడు కాస్తా ఆమె అయ్యాడు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు. అవి నాకు తెలుసు అంటుంది ఈమె. సాయితేజ కాస్తా ప్రియాంకగా మారిందిప్పుడు. ఈ మధ్యే ఆమెకు పెళ్లైందనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ తననెవరూ చేసుకోరని.. కానీ పోకిరిలు మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పింది ఈమె. తన పెళ్లిపై వస్తున్న వార్తలకు మరోసారి ఫుల్ స్టాప్ పెట్టింది ప్రియాంక.
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)
తనకు పెళ్లి కాలేదని.. మళ్లీ మళ్లీ పెళ్లైందంటూ వార్తలు ప్రచారం చేయొద్దని కోరుకుంటుంది ఈ జబర్దస్త్ నటి. సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలా మంది వేధించారని.. ఇష్టమొచ్చినట్లు విమర్శించారని గుర్తు చేసుకున్నాడు సాయితేజ. ఈ మధ్యే ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టింది ప్రియాంక. ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతుంది ప్రియాంక. ఇక ఇప్పుడు కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతుంది ఈమె.
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)
ఈ మధ్యే తనకు ఓ దర్శకుడు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో ఐటం సాంగ్ చేస్తావా అని అడిగాడని.. వెంటనే తాను కూడా చేస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ప్రియాంక. అయితే ఆ పాటలో ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుందని చెప్పాడని దానికి కూడా ఓకే అన్నట్లు చెప్పింది ప్రియాంక. పెద్ద హీరోయిన్లే చేస్తున్నపుడు తానెందుకు చేయనని చెప్పింది ఈమె. ఈ పాటను వరంగల్‌లో షూట్ చేయాల్సి వస్తుందని.. అక్కడే మూడ్రోజులు ఉండాలని చెప్పాడని చెప్పింది ఈమె. అన్నీ సర్దుకుని తాను కూడా వరంగల్ షూట్ కోసం బయల్దేరుతున్న సమయంలో అదే దర్శకుడు కాల్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడాడని చెబుతుంది ప్రియాంక. తనతో మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని.. ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది.
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)
దాంతో ఆ సినిమా వదిలేసుకుంది ఈమె. అక్కడితో ఈమెపై వేధింపులు ఆగలేదు.. పెళ్లిపై కమెంట్స్.. ఆ తర్వాత ఆమె మారిన తీరుపై కమెంట్స్.. టిక్ టాక్ వీడియోలు చేస్తే కమెంట్స్.. ఇలా అన్నింట్లోనూ కొందరు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. వేధిస్తున్నారని చెబుతుంది ప్రియాంక. దాంతో పాటు పెళ్లి విషయంపై కూడా కావాలనే రచ్చ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది ప్రియాంక. తనను అర్థం చేసుకుని పెళ్లి చేసుకునేవాడు దొరికితే కచ్చితంగా ఏడడుగులు నడుస్తానని.. కానీ అలాంటి వాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నిస్తుంది ఈమె. దయచేసి తనపై తప్పుడు వార్తలు మాత్రం రాయొద్దంటూ మీడియాను వేడుకుంటుంది ప్రియాంక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.