• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • JABARDASTH COMEDY SHOW EX COMEDIAN COMMENTS ON ROJA AND NAGABABU MK

నాగబాబు ముందు రోజా ఎంత...సంచలన కామెంట్స్ చేసిన స్టార్ కమెడియన్...

నాగబాబు రోజా ఫైల్ ఫోటోస్ (Naga Babu Roja)

జబర్దస్త్ జడ్జీల్లో నాగబాబు, రోజాల్లో ఎవరు ఇష్టం అంటే నాగబాబు వైపే తన ఓటు అంటు ధన్ రాజ్ కుండబద్దలు కొట్టాడు. జబర్దస్త్ కమెడియన్స్ అందరూ నాగబాబు వైపే ఉంటారని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు.

  • Share this:
    నాగబాబు నవ్వే జబర్దస్త్ కు ఎసెట్ అంటూ ప్రముఖ కమెడియన్ ధనరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధన్ రాజ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జీ తెలుగు చానెల్ లో అదిరింది ప్రోగ్రాం ద్వారా ధన్ రాజ్ మరోసారి బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ధన్ రాజ్ ఈ సందర్భంగా జబర్దస్త్ ప్రోగ్రాంపై సంచలన కామెంట్స్ చేశాడు. ఇందులో ప్రధానంగా అదిరింది ప్రోగ్రాం కంటే జబర్దస్త్ లోనే రెమ్యూనరేషన్ ఎక్కువ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు అదిరింది ప్రోగ్రాం అనుకున్నంత సక్సెస్ కాలేదు కదా అనే ప్రశ్నకు...తామేమి బెంచ్ మార్కు పెట్టుకోలేదని, షో ఈ స్థాయిలో సక్సెస్ అయితేనే విజయవంతం అయినట్లు భావించడం లేదని చెప్పుకొచ్చాడు. 22 ఎపిసోడ్స్ వరకూ మాత్రమే అదిరింది ప్రోగ్రాం అనుమతి పొంది ప్రారంభం అయ్యిందని, అయితే ప్రస్తుతం జీ తెలుగు చానెల్ యాజమాన్యం 52 ఎపిసోడ్స్ కు పెంచుతూ అనుమతి ఇచ్చిందని ధన్ రాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. యూట్యూబ్‌లో కూడా అదిరింది స్కిట్స్ వన్ మిలియన్ దాటుతున్నాయని, రేటింగ్స్ కూడా పర్వాలేదని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు అదిరింది షో ఇప్పుడిప్పుడే నడక ప్రారంభించిందని తెలిపాడు. ఈ సందర్భంగానే జబర్దస్త్ జడ్జీల్లో నాగబాబు, రోజాల్లో ఎవరు ఇష్టం అంటే నాగబాబు వైపే తన ఓటు అంటు ధన్ రాజ్ కుండబద్దలు కొట్టాడు. జబర్దస్త్ కమెడియన్స్ అందరిలో కూడా నాగబాబు వైపే ఉంటారని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు.
    Published by:Krishna Adithya
    First published: