జబర్దస్త్ షో కీలక మార్పులు.. ఆ టీమ్ లీడర్ పోస్టింగ్ ఊస్ట్..?

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 28, 2020, 6:48 PM IST
జబర్దస్త్ షో కీలక మార్పులు.. ఆ టీమ్ లీడర్ పోస్టింగ్ ఊస్ట్..?
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో. ఏడేళ్లుగా టాప్ ప్రోగ్రామ్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుందంటే చిన్న విషయం కాదు. దీనికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షోకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్ర‌తీ వారం రెండు రోజులు వ‌చ్చాయంటే టీవీల ముందు కూర్చుంటారు ఆడియ‌న్స్. అంత‌టి పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్. ఈ షో నుంచి చాలా మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు.. వస్తున్నారు కూడా. అయితే కేవ‌లం కామెడీతో కాకుండా కాంట్ర‌వ‌ర్సీల‌తో కూడా ఈ షో బాగా వార్త‌ల్లోకి వ‌స్తుంది.

జబర్దస్త్ షో నాగబాబు చమ్మక్ చంద్ర (Jabardasth Comedy Show)
జబర్దస్త్ షో నాగబాబు చమ్మక్ చంద్ర (Jabardasth Comedy Show)


కేవ‌లం హిందీలో మాత్ర‌మే పాపుల‌ర్ అయ్యే కామెడీ షోల‌ను తెలుగులో కూడా పాపుల‌ర్ అయ్యేలా చేసింది ఈ షో. తెలుగు కామెడీ షోస్ లో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది జ‌బ‌ర్ద‌స్త్. అయితే ఎంత న‌వ్విస్తుందో.. అంత వివాదాల్లో ఇరుక్కుంటుంది ఈ షో. ఇప్పుడు దీని గురించి మరో సంచలన వార్త బయటికి వస్తుంది. జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ అంటూ రెండు వారాలుగా విడగొట్టి చేస్తున్న ఈ కార్యక్రమంలో కొన్నేళ్లుగా నాగబాబు, రోజా మూలస్థంభాలుగా ఉన్నారు. అయితే కొన్ని నెలల కింద నాగబాబు వెళ్లిపోయాడు. ఆయనతో పాటు ఆర్పీ, చంద్ర లాంటి వాళ్లను కూడా తీసుకెళ్లిపోయాడు.

సత్తిపండు ఆనంద్ కొత్త టీం (Jabardasth Comedy Show)
సత్తిపండు ఆనంద్ కొత్త టీం (Jabardasth Comedy Show)




చమ్మక్ చంద్ర, ఆర్పీ వెళ్లిపోయిన తర్వాత మరో ఇద్దరు కొత్త టీం లీడర్స్‌ను తీసుకొచ్చారు. చంద్ర టీంలోనే చేస్తున్న సత్తిపండుతో పాటు ఆనంద్‌ను కలిపి టీం లీడర్స్‌ను చేసారు. ఈ టీంకు సరదా సత్తిపండు, అదుర్స్ ఆనంద్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఈ టీంలో ఉన్న సత్తిపండును టీం లీడర్ నుంచి తీసేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ టీం పర్ఫార్మ్ చేస్తున్నా కూడా రేటింగ్ విషయంలో మాత్రం వీళ్ళు ఊహించినంతగా చేయడం లేదని డైరెక్షన్ టీం భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో శేకింగ్ శేషు, గెటప్ శ్రీను, అల్లరి రవి, చిత్రం శ్రీను లాంటి వాళ్లు కూడా జబర్దస్త్‌లో టీం లీడర్స్‌గా చేసినా సక్సెస్ కాలేదు. అలాగే సత్తిపండు కూడా మిగిలిపోతున్నాడు.

సత్తిపండు ఆనంద్ కొత్త టీం (Jabardasth Comedy Show)
సత్తిపండు ఆనంద్ కొత్త టీం (Jabardasth Comedy Show)


అందుకే ఇప్పుడు సత్తిపండు స్థానంలో మరో కొత్త టీం లీడర్‌ను తీసుకురావాలని చూస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో కూడా సత్తిపండు ఎగ్జిట్‌పై రోజా కూడా అదిరిపోయే పంచులు వేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదంటే.. నువ్వేం చేస్తున్నావో మాకు కూడా అర్థం కావడం లేదు.. ముందు నువ్వు పోకుండా చూసుకో.. నిన్ను తీసేస్తే సరిపోతుంది అంటూ పంచులు వేసింది. సరదా కోసం ఆ డైలాగులు అన్నా కూడా ఇప్పుడు నిజంగా డైరెక్షన్ టీం కూడా ఇదే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరో రెండు మూడు ఎపిసోడ్స్ చూసి సత్తిపండుకు డిమోషన్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి మరోసారి జబర్దస్త్‌లో మార్పులు జరుగుతున్నాయన్నమాట.
First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading