జబర్దస్త్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నాగబాబు ఇంకా ఆ షోను వదలడం లేదు. ఇప్పటికీ అదే సీక్రేట్స్ చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికే తన ఛానెల్‌లో ఈ షో ఎలా మొదలైంది.. అసలు అప్పుడేం జరిగింది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2019, 10:10 PM IST
జబర్దస్త్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
నాగబాబు (file photo)
  • Share this:
జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నాగబాబు ఇంకా ఆ షోను వదలడం లేదు. ఇప్పటికీ అదే సీక్రేట్స్ చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికే తన ఛానెల్‌లో ఈ షో ఎలా మొదలైంది.. అసలు అప్పుడేం జరిగింది అనేది చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు నాగబాబు. ముఖ్యంగా జబర్దస్త్ షోను మధ్యలో ఉన్న వాళ్లే నాశనం చేసారని చెప్పుకొచ్చాడు నాగబాబు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఇది తెలుసో లేదో నాకు తెలియదు.. తెలిసినా కామ్‌గా ఉంటే నేనేం చేయలేనంటూ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు మెగా బ్రదర్. ఆయన బయటికి వచ్చిన తర్వాత ఒక్కో విషయం చెబుతుంటే అంతా షాక్ అవుతున్నారు.

Jabardasth Comedy Show damaged by Mallemala production team only says Mega Brother Naga Babu pk జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నాగబాబు ఇంకా ఆ షోను వదలడం లేదు. ఇప్పటికీ అదే సీక్రేట్స్ చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికే తన ఛానెల్‌లో ఈ షో ఎలా మొదలైంది.. అసలు అప్పుడేం జరిగింది.. jabardasth comedy show,jabardasth comedy show secrets,jabardasth comedy show judge,jabardasth nagababu,nagababu channel,nagababu my channel naa istam,nagababu interview,jabardasth comedy show episode,jabardasth comedy show latest episode,jabardasth latest promo,jabardasth comedy show directors,jabardasth comedy show mallemala,jabardasth comedy show shyam prasad reddy,jabardasth comedy show promo,sudigali sudheer,rashmi gautam,anasuya bharadwaj,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ జాతకం బయటపెట్టిన నాగబాబు,నాగబాబు ఛానెల్,నాగబాబు మై ఛానెల్ నా యిష్టం,నాగబాబు జబర్దస్త్,జబర్దస్త్ సీక్రేట్స్,తెలుగు సినిమా
నాగబాబు ఫైల్ ఫోటో


జబర్దస్త్ షోకు తాను చాలా చేసానని.. పైకి కనిపించకపోయినా కూడా లోలోపల షో బాగు కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పాడు నాగబాబు. మీరు లేకపోతే షో చూడలేకపోతున్నాం సర్ అంటూ ఇప్పటికీ చాలా మంది చెబుతున్నారని.. అలాంటి వాళ్లకు తానేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదంటున్నాడు ఈయన. ముఖ్యంగా తనను బాగా చూసుకున్నారు కానీ తన చుట్టూ ఉన్న వాళ్లను మాత్రం ట్రీట్మెంట్ దారుణంగా ఉండేదని గుర్తు చేసుకున్నాడు నాగబాబు. అందులో ఉన్న వాళ్లందరి గురించి ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వచ్చాడు నాగబాబు.

మొదట్లో సీనియర్ టీం లీడర్స్ ఉండేవాళ్లని.. అందులో వేణువండర్స్‌పై ఓసారి దాడి జరిగితే కనీసం మల్లెమాల కానీ.. ఛానెల్ వాళ్లు కానీ ఒక్కముక్క కూడా మాట్లాడలేదని చెప్పాడు నాగబాబు. అప్పుడు తానే ముందుకెళ్లి అన్నీ చూసుకున్నానని చెప్పాడు. మల్లెమాల మాట్లాడాలని కోరుకోకపోయినా కూడా కనీసం స్పందించి ఉంటే బాగుండేదని చెప్పాడు. కార్పోరేట్ కంపెనీలాగే ఆలోచించి.. తమ షో ఒక్కటి బాగా వస్తే చాలు ఎవరు ఎటుపోతే తమకెందుకు అన్నట్లే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్.

వేణు, ధనరాజ్ లాంటి వాళ్లు అందుకే బయటికి వెళ్లిపోయరేమో అని తెలిపాడు నాగబాబు. ఇక ఆ తర్వాత సుడిగాలి సుధీర్, ఆర్పీ, భాస్కర్ లాంటి వాళ్లు టీం లీడర్స్ కావడంలో తాను కూడా కీలక పాత్ర పోషించానని చెప్పాడు నాగబాబు. ఎవరికి ఏ కష్టమొచ్చినా కూడా అంతా కలిసి పంచుకున్నామని.. పంచ్ ప్రసాద్‌కు అనారోగ్యం వచ్చినపుడు కూడా అంతా కలిసే ఉన్నామని.. అప్పుడు కూడా ఛానెల్, మల్లెమాల సాయం చేయలేదని చెప్పుకొచ్చాడు. ఇలా చాలా విషయాల్లో అసలు మల్లెమాల నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పాడు నాగబాబు.
Published by: Praveen Kumar Vadla
First published: November 30, 2019, 10:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading