• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JABARDASTH COMEDY SHOW COMPLETED 400 EPISODES AND HYPER AADI ANASUYA BHARADWAJ GETS VERY EMOTIONAL PK

Jabardasth 400 Episode special: జబర్దస్త్ 400 ఎపిసోడ్ సెలబ్రేషన్స్.. కన్నీరు పెట్టుకున్న హైపర్ ఆది..

Jabardasth 400 Episode special: జబర్దస్త్ 400 ఎపిసోడ్ సెలబ్రేషన్స్.. కన్నీరు పెట్టుకున్న హైపర్ ఆది..

జబర్దస్త్ 400వ ఎపిసోడ్ (jabardasth 400th episode)

Jabardasth 400 Episode special: తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వాళ్లుండరేమో..? ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కలిసి ఈ కామెడీ షోను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఒక్కరు ఇద్దరు కాదు ఈ షో నుంచి చాలా మంది..

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వాళ్లుండరేమో..? ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కలిసి ఈ కామెడీ షోను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఒక్కరు ఇద్దరు కాదు ఈ షో నుంచి చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి కూడా వచ్చారు. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఈ షో ఇప్పుడు మరో సంచలన రికార్డు నమోదు చేసింది. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసింది ఈ షో. ఇప్పుడు మరో రికార్డ్ ఈ ఖాతాలో చేరిపోయింది. జబర్దస్త్ కామెడీ షో మొదలై 400 వారాలు పూర్తైపోయింది. మరో వారం రోజుల్లో ఈ పండగను చేసుకుంటున్నారు నిర్వాహకులు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో అంబరాన్ని తాకే సంబరాలు జరుగుతున్నాయి. 2013 ఫిబ్రవరిలో మొదలైన జబర్దస్త్ కామెడీ షో 25 ఎపిసోడ్స్ అని ప్లాన్ చేసుకుంటే ఏకంగా 400 ఎపిసోడ్స్ వరకు వచ్చింది. దాన్నిబట్టే షో ఎంత పెద్ద సక్సెస్ అనేది అర్థమవుతుంది. మల్లెమాల ప్రొడక్షన్స్ మొదలుపెట్టిన ఈ షో నుంచే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సహా ఎంతోమంది కుర్ర కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. నాగబాబు, రోజా జడ్జులుగా మొదలైన ఈ షో నుంచి గతేడాది మెగా బ్రదర్ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చాడు. 400 ఎపిసోడ్స్ ప్రయాణం తమకు చాలా సంతృప్తిని ఇచ్చిందంటూ చెబుతుంది రోజా.
jabardasth,jabardasth comedy show 400 episodes,jabardasth 400th episode promo,jabardasth latest episode,jabardasth judge roja,jabardasth comedy show,sudigali sudheer jabardasth,hyper aadhi jabardasth cried in 400 episode,jabardasth chammak chandra,jabardasth anasuya bharadwaj,jabardasth rashmi gautham,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కామెడీ షో 400 ఎపిసోడ్స్,జబర్దస్త్ కామెడీ షో 400 ఎపిసోడ్ ప్రోమో,ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది
జబర్దస్త్ 400వ ఎపిసోడ్ (jabardasth 400th episode)

నిజానికి కమెడియన్ల జాతకాలనే కాదు.. నాగబాబు, రోజాను కూడా జబర్దస్త్ కామెడీ షో నిలబెట్టింది. వాళ్ల కెరీర్‌లో ఈ షో లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ అనేది లేదు. ఇక జబర్దస్త్ 400వ స్పెషల్ ఎపిసోడ్‌లో చాలా ప్రత్యేకథలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌కు యాంకర్ ప్రదీప్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ 400 ఎపిసోడ్స్ ప్రయాణంలో తమ పాత్రలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా వెంకీ అయితే కన్నీరు మున్నీరయ్యాడు. ఒకప్పుడు తన కుటుంబంలోనే తనకు గుర్తింపు లేదని.. బంధువులు చులకనగా చూసే వాళ్లని కానీ ఇప్పుడు వెంకీ మా వాడే అని చెప్పుకుంటున్నారంటే దానికి కారణం జబర్దస్త్ అని ఏడ్చేసాడు ఈయన. అయితే తన సక్సెస్ చూడ్డానికి ఇప్పుడు నాన్న లేకపోవడం ఒక్కటే బాధ అంటున్నాడు వెంకీ.
jabardasth,jabardasth comedy show 400 episodes,jabardasth 400th episode promo,jabardasth latest episode,jabardasth judge roja,jabardasth comedy show,sudigali sudheer jabardasth,hyper aadhi jabardasth cried in 400 episode,jabardasth chammak chandra,jabardasth anasuya bharadwaj,jabardasth rashmi gautham,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కామెడీ షో 400 ఎపిసోడ్స్,జబర్దస్త్ కామెడీ షో 400 ఎపిసోడ్ ప్రోమో,ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది
జబర్దస్త్ 400వ ఎపిసోడ్ (jabardasth 400th episode)

మరోవైపు నాలుగేళ్ల కింద 100 రూపాయలు కావాలంటే పక్కింటి వాళ్లను అప్పు అడిగే స్టేజ్ నుంచి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అభి అన్నా.. జబర్దస్త్ కామెడీ షో అంటూ కన్నీరు పెట్టుకున్నాడు హైపర్ ఆది. ఇక అనసూయ అయితే తనకు వీళ్లంతా కావాలి.. వీళ్ల విషయంలో తాను చాలా పొసెసివ్ అంటూ ఏడ్చేసింది. రోజా కూడా జబర్దస్త్‌లో తమ అడుగులు గుర్తు చేసుకుంది. ఏదేమైనా కూడా 400వ ఎపిసోడ్ వేడుకలు మాత్రం అద్భుతంగా.. ఘనంగా జరిగాయి.

మరోవైపు 400 ఎపిసోడ్స్‌లో ఒక్కటి కూడా మిస్ కాకుండా చేసిన రాకెట్ రాఘవకు సన్మానం కూడా చేసారు. ఇక స్కిట్స్ పరంగా కూడా పర్ఫెక్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్ లీడర్స్. ఏదేమైనా కూడా జబర్దస్త్ కామెడీ షో అనేది ఇన్నేళ్లు సక్సెస్ ఫుల్‌గ రన్ కావడం కూడా పెద్ద విషయమే. తెలుగు ఇండస్ట్రీలో ఏ కామెడీ షో కూడా ఇన్నేళ్ల పాటు రాలేదు.. ఇకపై వస్తుందనే నమ్మకం కూడా లేదు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ జబర్దస్త్ కామెడీ షో తెలుగు బుల్లితెరపై ఓ సంచలనమే.
Published by:Praveen Kumar Vadla
First published: