Punch Prasad: జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు లైఫ్ అందుకున్నారు. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. అయితే నవ్వు వెనక ఏడుపు కూడా ఉంటుందన్నట్లు ఒక్కో నటుడి జీవితంలో ఒక్కో విషాదం కూడా ఉంది. ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్లో ఇలాంటి విషాదమే ఉంది. అతడే పంచ్ ప్రసాద్.. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఈయన పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తుంటాడు ఈయన. అప్పట్లో వరసగా కనిపించిన ప్రసాద్.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్క్రీన్ పై కనిపించలేదు. దాంతో జబర్దస్త్ షో మానేసాడేమో అనుకున్నారంతా.
కానీ ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయాయట. ఈయనకు డయాలిసిస్ చేయించుకుంటున్నారు. నీ పంచ్ వల్ల నా రెండు కిడ్నీలు పాడైపోయాయి. నేను ఎవరికైనా చెప్పానా ? అంటూ తనను వేధిస్తున్న సమస్యలను ప్రస్తావిస్తూనే ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు పంచ్ ప్రసాద్. ఓ వైపు కిడ్నీ సమస్యతో వేధిస్తుండగా.. తాజాగా ఈయనను మరో సమస్యను వేధిస్తోంది.
ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తలెత్తింది. ఈయన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ జబర్ధస్త్ నటుడు నూకరాజు ఓ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ప్రసాద్ ఆరోగ్యం కుదటపడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఆశీస్సులు అందించాలని కోరారు.
ఓ రోజు షూటింగ్ పూర్తైన వచ్చిన తర్వాతపంచ్ ప్రసాద్ జ్వరం వచ్చిందన్నారు. ఆ తర్వాత డాక్టర్ సలహాతో పెయిన్ కిల్లర్ ఇస్తే వేసుకున్నాడట. ఆ తర్వాత జ్వరం, నడుపు నొప్పి తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించారు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో చివరకు MRI స్కాన్ చేస్తే నడుము వెనక భాగం నుంచి కాలి వరకు చీము పట్టిందని ప్రసాద్ భార్య ఈ వీడియోలో తెలిపారు. ముఖ్యంగా డయాలిసిస్ చేయించుకునే రోగుల్లో నెమ్మదిగా ఇలాంటి సమస్యలు వస్తాయట. టెస్ట్ చేసిన తర్వాత ఇది మందులతో తగ్గుతుందా.. ? లేకపోతే ఆపరేషన్ చేస్తారా అనేది డాక్టర్లు చెబుతానన్నారు నూకరాజు. ఏమైనా కొన్నాళ్లుగా పంచ్ ప్రసాద్.. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దాన్ని భరిస్తూనే ఈయన కొన్ని స్కిట్స్ చేస్తూ అభిమానులను నవ్విస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.