అందుకే పెళ్లి.. రష్మీ, సుధీర్ జంటపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ

రష్మీ, అనసూయ అందరితోనూ సరదాగా ఉంటారని .. ఎలాంటి ఆటిట్యూడ్ చూపించరని కొనియాడారు.

news18-telugu
Updated: September 13, 2019, 4:39 PM IST
అందుకే పెళ్లి.. రష్మీ, సుధీర్ జంటపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్
  • Share this:
రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్..! ఈ జంటకు యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. 'జబర్దస్త్‌'తో పాటు 'ఢీ' షోలో వీరిద్దరు చేసే సందడి అంతా ఇంతా కాదు. రష్మీ-సుధీర్ కెమిస్ట్రీనికి క్యాష్ చేసుకునేందుకు డైరెక్టర్లు కూడా వీళ్ల చుట్టూనే స్కిట్స్ రాస్తుంటారు. స్మాల్ స్క్రీన్‌పై సుధీర్-రష్మీ రొమాన్స్‌‌‌ని చూసి వీరిమధ్య నిజంగానే ఏదో ఉందనే పుకార్లు ఎప్పటి నుంచో షికారు చేస్తున్నాయి. అదేం లేదని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా జనాలు మాత్రం నమ్మడం లేదు. తాజాగా వీరి బంధంపై జబర్దస్త్ కమెడియన్ అప్పారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఎక్కడికి వెళ్లినా...సుధీర్-రష్మీ గురించి అడగడం సర్వ సాధారణమైపోయిందని ఓ యూట్యూబ్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తెలిపారు అప్పారావు. సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచమని.. ఇందులో గ్లామర్ ఎంత ఉంటుందో, రూమర్ కూడా అంతే ఉంటుందని ఆయన చెప్పారు. ఒక స్కిట్‌లో చేసిన దాన్ని పట్టుకొని సుధీర్, రష్మీ మధ్య పుకార్లు సృష్టించారని తెలిపారు. దాని మీద డైరెక్టర్లు కథ అల్లుకొని 'అహనా పెళ్లంట' కార్యక్రమంలో సుధీర్, రష్మీకి పెళ్లి నిర్వహించారని అప్పారావు పేర్కొన్నారు. ఆ స్కిట్‌‌లో కలలో రష్మీని సుధీర్ పెళ్లి చేసుకుంటాడని చెప్పుకొచ్చారు. అది డైరెక్టర్స్ క్రియేటివిటీ అని ప్రశంసించారు.

స్టేజిపై స్కిట్‌ వరకు మాత్రమే అది పరిమితమని..ఆ తర్వాత ఆమెతో కూర్చొని మాట్లాడేది కూడా ఉండదని అప్పారావు స్పష్టంచేశారు. రష్మీ, అనసూయ అందరితోనూ సరదాగా ఉంటారని .. ఎలాంటి ఆటిట్యూడ్ చూపించరని కొనియాడారు. షోపై వారికి అపారమమైన గౌరవం, ఇష్టం ఉందని.. అందుకే ఇలాంటి పుకార్లను ఇద్దరూ అస్సలు పట్టించుకోరని స్పష్టంచేశారు. ఒక సినిమాలో ఇద్దరు యాక్టర్లు అన్నదమ్ములుగా చేసి మంచి పేరు వస్తే తర్వాతి సినిమాల్లోనూ వారి చుట్టూ కథలు అల్లడం సహజమని చెప్పుకొచ్చారు. అంతే తప్ప రష్మీ-సుధీర్ మధ్య ఏమీ లేదని.. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు అప్పారావు.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading