Home /News /movies /

JABARDASTH COMEDY SHOW ANOTHER LOVE COUPLE ROMANCE WITH IN FRONT OF JUDGE ROJA TA

Jabardasth - MLA Roja:స్టేజ్ పైనే అడ్డంగా దొరికి పోయిన జబర్ధస్త్ ప్రేమ జంట.. రోజా చూస్తుండగానే..

ఎమ్మెల్యే రోజా (File/Photo)

ఎమ్మెల్యే రోజా (File/Photo)

Jabardasth | ఈ టీవీలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే జబర్థస్త్ షో ఎంత పాపులర్ తెలిసిందే కదా.  అంతేకాదు ఈ షో కోసం వేచి చూసే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఈ షోలో రోజా ముందే ఓ జంట చేసిన పనికి రోజాకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయింది.

ఇంకా చదవండి ...
    Jabardasth - MLA Roja:  ఈ టీవీలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే జబర్థస్త్ షో ఎంత పాపులర్ తెలిసిందే కదా.  అంతేకాదు ఈ షో కోసం వేచి చూసే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ షోలో హైపర్ ఆది వేసిన స్కిట్స్ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుంటాయి. ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఈ షోతో ఎంత మంది కమెడియన్స్‌ వెలుగులోకి వచ్చారు. అంతేకాదు వీళ్లు సినిమాల్లో కూడా సత్తా చూపెడుతున్నారు. ప్రస్తుతం ఈ షోకు రోజాతో పాటు సింగర్ మనో జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జబర్ధస్త్‌ షోతో పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ ఎవరన్నా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఇమాన్యుయేల్. జబర్ధస్త్‌లో మాములు కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇతను తనదైన పంచ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఎంతో  మంది స్కిట్స్‌లలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు టీమ్ లీడర్లు కూడా ఇమాన్యుయేల్‌ ద్వారా కామెడీ చేయించడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దీంతో ఇందు గలడు అందు లేడని సందేహం వలదు అన్నట్టు ప్రతి టీమ్‌లో ఇమ్మాన్యుయేల్ కామెడీ కామన్ అయిపోయింది. అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. జబర్ధస్త్‌ స్కిట్‌లో హైపర్ ఆది.. ఎక్కువగా అనసూయ పై పంచ్‌లు వేస్తుంటాడు. అదే సమయంలో సుడిగాలి సుధీర్..రష్మి గౌతమ్‌‌ను తన కామెడీ పంచ్‌లతో రెచ్చ గొట్టడం చూస్తూనే ఉన్నాం.

    తాజాగా ఈ షోలో ఇమ్మాన్యుయేల్ వర్షతో చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదిరిపోయింది. ఈ సందర్భంగా వర్షతో ఇమ్మాన్యుయేల్ వరల్డ్ కప్.. నా లిప్ దొరకడం కొంచెం కష్టం అంటూ చెప్పడం అందరినీ నవ్వించింది. ఈ సందర్భంగా రోజా నేను బయలు దేరుతున్నా.. ఏమి చేస్తాం..వర్ష .. ఇమ్మాన్యుయేల్ పడిపోయిందనే సరికి.. అదంత స్కిట్ వరకే పరిమతం అంటూ వర్ష చెప్పింది. ఈ సందర్భంగా రోజా మీ మధ్య ఏమైనా ఉందా.. అంటే బయట కూడా అంటూ చెప్పడం నవ్వులు పూయించింది.



    ఇది చూసి అవాక్కవడం రోజా వంతు అయింది. మరోవైపు ఇమ్మాన్యుయేల్.. రోజాను టార్గెట్ చేస్తూ.. పెళ్లి సందడిలో మా పెరటి జాంచెట్టు పళ్లన్ని కుశలం అడిగే పాటలో రాఘవేంద్రరావు చూపించిన నాభి ఎవరిదో తెలుసా.. నాదే అంటూ చెబుతాడు. అంతేకాదు భైరవ ద్వీపంలో సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా అంటూ డైలాగ్ చెబుతున్న సమయంలో జడ్జి రోజా వెంటనే కలగజేసుకొని రేయ్ చంపేస్తాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో నవ్వుకోవడం అందరి వంతు అయింది. మొత్తానికి ఇమ్మాన్యుయేల్ రోజా సినిమా భైరవ ద్వీపం సినిమాను టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth comedy show, MLA Roja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు