ట్రెండ్ మార్చిన రష్మీ గౌతమ్... ఇక ఫ్యాన్స్‌కి పండగే...

Jabardasth Comedy Show : జబర్దస్త్ కామెడీ షోల నుంచీ నాగబాబు వెళ్లిపోయిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఓ మార్పు చేసింది.

news18-telugu
Updated: December 10, 2019, 12:32 PM IST
ట్రెండ్ మార్చిన రష్మీ గౌతమ్... ఇక ఫ్యాన్స్‌కి పండగే...
ట్రెండ్ మార్చిన రష్మీ గౌతమ్... ఇక ఫ్యాన్స్‌కి పండగే... (credit - insta - rashmigautham)
  • Share this:
Jabardasth Comedy Show : ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ అశేష అభిమానులను సంపాదించుకున్న రష్మీ గౌతమ్... సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ తన ఫ్యాన్స్, ఫాలోయర్లతో పంచుకుంటుంది. అప్పుడప్పుడూ మానవతా దృక్పథంతో సమాజ సేవకు సంబంధించిన పిలుపులు కూడా ఇస్తుంటుంది. ఐతే... జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు... లోకల్ గ్యాంగ్స్‌ షోకి వెళ్లిపోవడంతో... ఆ రెండు షోల రేటింగూ పడిపోకుండా చూసుకునే బాధ్యతను జడ్జి, ఎమ్మెల్యే రోజా, యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌తోపాటూ... టీమ్ లీడర్లు నెత్తికెత్తుకున్నారు. అందుకోసం టీమ్‌లలో చేసిన మార్పులూ, చేర్పులూ మొత్తానికి జబర్దస్త్ షోను అలాగే నిలబెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో... లోకల్ గ్యాంగ్స్‌కి రేటింగ్ పెద్దగా రాకపోవడంతో... నాగబాబు ఏం చెయ్యాలన్నదానిపై లోతిగా ఆలోచిస్తున్నారని సమాచారం.
View this post on Instagram


A post shared by Rashmi Gautam (@rashmigautam) on

తెలుగు సంపూర్ణంగా తెలియకపోయినా... తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ తాజాగా... తన వంతుగా జబర్దస్త్ షో రేటింగ్ పెంచేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల శైలిని మార్చింది. ఇదివరకు సింగిల్ ఫొటోలను మాత్రమే షేర్ చేసిన ఈ బ్యూటీ... ఇప్పుడు... మల్టిఫుల్ ఫొటోలను అసెంబ్లింగ్ చేసి... సింగిల్ ఫొటోగా షేర్ చేస్తోంది. వీటిలో రష్మీ ఒకే సందర్భంలో వేర్వేరు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ... చలాకీగా కనిపిస్తుండటంతో... ఇవి చాలా బాగున్నాయని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram

#rashmigautam #lifeismagical #grateful for all the love 💓 and support


A post shared by Rashmi Gautam (@rashmigautam) on

View this post on Instagram

#happysundayeveryone Thankyou for the constant love and support #rashmigautam #lifeismagical #fanedits


A post shared by Rashmi Gautam (@rashmigautam) on

అలాగే... రష్మీ గౌతమ్... తన పర్సనల్ ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా పెంచింది. హైలైట్స్ మొత్తం 20కి పెంచింది. తద్వారా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా జబర్దస్త్ కామెడీ షోని అదే రేంజ్‌లో నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమే.


Pics : అందాల జల్లు కురిపిస్తున్న రష్మిక మందన్న
ఇవి కూడా చదవండి :

శ్రీలంక తమిళుల సంగతి చూడండి... కేంద్రానికి రవిశంకర్ విజ్ఞప్తి

లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకుపై బాంబు దాడి... తృటిలో తప్పించుకున్న తల్హా సయీద్

తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడిపై NIA కేసు నమోదు... ఎందుకంటే...

విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...

ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...
Published by: Krishna Kumar N
First published: December 10, 2019, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading