జబర్దస్త్ రష్మీ రిక్వెస్ట్... ఆ రెండున్నర గంటలూ...

Jabardasth Rashmi Gautam : జబర్దస్త్ రష్మీ గౌతమ్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వాలంటీర్ విత్ యూ అండ్ ఐలో చేరి... వాలంటీర్ అవ్వమని తన ఫ్యాన్స్‌ని కోరుతోంది.

news18-telugu
Updated: November 18, 2019, 12:37 PM IST
జబర్దస్త్ రష్మీ రిక్వెస్ట్... ఆ రెండున్నర గంటలూ...
రష్మీ గౌతమ్ (credit - insta - rashmigautam)
  • Share this:
Jabardasth Rashmi Gautam : సినిమా తెరపై, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలో... ఫుల్ యాక్టివ్‌గా కనిపించే నటి, యాంకర్ రష్మీ గౌతమ్... షూటింగ్ తర్వాత... కల్చరల్ యాక్టివిటీస్ చాలా చేస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె... ట్విట్టర్ ద్వారా... తన అభిమానులకు రిక్వెస్ట్ చేస్తోంది. వాలంటీర్ విత్ యూ అండ్ ఐ అనే స్వచ్ఛంద సంస్థలో చేరి... వాలంటీర్‌గా మారమని కోరుతోంది. ఇందుకు సంబంధించి ఆమె ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరిలా రొటీన్‌గా కాకుండా... విభిన్నంగా ఉండేందుకు ఇదో మంచి ఛాన్స్ అంటున్న రష్మీ గౌతమ్... వాలంటీర్‌గా చేరి... చిన్నారులకు సాయం చెయ్యమని కోరుతోంది. ఈ పోస్ట్‌ను చాలా మంది లైక్ చేస్తున్నారు. ఇందులో చేరతామని కొందరు చెబుతున్నారు.


ఇంతకీ వాలంటీర్ విత్ యూ అండ్ ఐ అనేది ఏంటంటే... ఇదో మంచి స్వచ్ఛంద సంస్థ. దేశవ్యాప్తంగా పేద చిన్నారులకు ఉచితంగా విద్య, ఇతరత్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కల్పిస్తోంది. దీన్లో వాలంటీర్‌గా చేరేందుకు ఏ డబ్బూ చెల్లించాల్సిన పని లేదు. ఈ సంస్థకు volunteer.uandi.org.in అనే పోర్టల్ ఉంది. ఇందులోకి వెళ్లి... వాలంటీర్‌గా చేరాలనుకునేవారు... తాము ఉండే నగరాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎంచుకున్న తర్వాత... వారికి ఓ ఫామ్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఫిలప్ చేస్తే చాలు... వాలంటీర్ అయిపోయినట్లే.

వాలంటీర్ విత్ యూ అండ్ ఐ
వాలంటీర్ పనేంటి : వాలంటీర్ అయిన వ్యక్తి... తనకున్న విద్యా టాలెంట్‌ను చిన్నారులకు షేర్ చెయ్యాలి. వారంలో 2న్నర గంటలు... చిన్నారుల కోసం కేటాయించాలి. తనకు వచ్చిన సబ్జెక్ట్‌పై చిన్నారులకు విద్యను నేర్పాలి. ఎక్కడ నేర్పాలి, ఎలా నేర్పాలి అనే విషయాన్ని తాము చూసుకుంటామని వాలంటీర్ విత్ యు అండ్ ఐ సంస్థ నిర్వాకులు తెలిపారు.

ఇలా వారానికి 2న్నర గంటలు... ఏడాదిలో 9 నెలల పాటూ కేటాయిస్తే చాలనీ... పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు వీలవుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇది మంచి ఉద్దేశంతో ఏర్పడిన సంస్థగా అందరూ చెబుతుండటంతో... రష్మీ గౌతమ్ దీనికి సపోర్ట్ చేస్తూ... ట్వీట్ చేసింది.

 

Pics : బెంగాలీ రసగుల్ల నైనా గంగూలీ అందాలు అదరహో...ఇవి కూడా చదవండి :

భర్తకు విషం ఇచ్చిన భార్య... పెళ్లైన వారానికే...

షానా చౌహాన్... సక్సెస్‌కి చిరునామా...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?
First published: November 18, 2019, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading