స్మాల్ స్క్రీన్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రష్మీ గౌతమ్.. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా సామాన్యులకు, సెలబ్రిటీల మధ్య దూరం చెరిగిపోయింది. ఆన్ లైన్ వేదికగా ఉపయోగించుకుంటూ తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. ఇటు సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఆన్‌లైన్ వేదికగా సెలబ్రిటీలు సందేశాలు పెట్టడం సులువైపోయింది. దానికి నెటిజన్లు అదే రీతిలో రెస్పాన్స్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పెళ్లి ఎపుడు చేసుకుంటారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలన్నారు. లాక్‌డౌన్‌లో రెండు కిలోల బరువు పెరిగాన్నారు. మరోవైపు లాక్‌డౌన్ జంతువులకు మనుషులకు ఆహారం సప్లై చేస్తున్నాను అందుకే తనకు టైమ్ తెలియడం లేదన్నారు. మరోవైపు తన బ్రేకప్ విషయమై స్పందించింది. ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పాను. పర్సనల్ లైఫ్.. పర్సనల్‌గా ఉండాలని చెప్పాను కదా అని కాస్తంత ఘాటుగానే స్పందించింది. మరోవైపు ఓ నెటిజన్.. గుంటూరు టాకీస్ తనకిష్టమైన సినిమా అంటూ మళ్లీ సినిమాల్లోకి ఎపుడొస్తారనే ప్రశ్నకు.. సరైన స్క్రిప్ట్ ఉంటే యాక్ట్ చేస్తానంది. మరోవైపు సుధీర్ తో ప్రేమాయణంపై స్పందిస్తూ.. మేమిద్దరం కేవలం కొలీగ్స్ మాత్రమే తెరపై ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండాలంటే అలా చేస్తున్నాం. మా మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదంది. మిమ్మల్ని టీవీ షోస్‌లో మిస్ అవుతున్నాం. త్వరంగా తెరపైకి రండి అనేదానికి అది సాధ్యం కాదు. ప్రధాని మోదీ గారి నుంచి తదుపరి ప్రకటన రావాలంంటూ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood