జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...? ఇవీ కారణాలు

Jabardasth Rashmi Gautam : బుల్లి తెరపై కలిసి సందడి చేసే జబర్దస్త్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య గ్యాప్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 11, 2019, 7:39 AM IST
జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...? ఇవీ కారణాలు
జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...?
news18-telugu
Updated: November 11, 2019, 7:39 AM IST
Jabardasth Rashmi Gautam : ఎక్స్‌ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్ పేరు చెప్పగానే... చాలా మంది మైండ్‍‌లో మెదిలే మరోపేరు సుడిగాలి సుధీర్. కారణం... జబర్దస్త్ షోతోపాటూ... ఢీ షోలో కూడా వీళ్లిద్దరూ కలిసి మెలిసి సందడి చేస్తారు. ఆన్‌స్క్రీన్‌పై ఒకర్నొకరు సరదాగా సెటైర్లు వేసుకుంటారు. ఒకర్నొకరు ఆటపట్టించుకుంటారు. ఇది చూసిన చాలా మంది వీళ్ల మధ్య ఏదో ఉందనీ, తెరవెనక ఏదో జరుగుతోందనీ భావించడం సహజం. నిజానికి అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. కేవలం ఆ రెండు షోల రేటింగ్స్ పెంచడం కోసమే ఇలాంటి సరదా సెటైర్లు వేసుకుంటున్నారే తప్ప... నిజంగా వాళ్ల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ లేదన్న విషయం తాజాగా బయటపడింది.

సుడిగాలి సుధీర్ తాజాగా సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో... లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమాకి హీరోయిన్‌గా ముందుగా రష్మీ గౌతమ్‌ని ఎంచుకున్నాడు సుధీర్. ఆల్రెడీ వాళ్లిద్దరి మధ్యా ఉన్న ర్యాపో కారణంగా... సినిమాకి కలిసొస్తుందని అనుకున్నాడు. ఐతే... రష్మీ తనకు డేట్స్ ఖాళీగా లేవనీ, జూన్ వరకూ తనకు వేరే షెడ్యూళ్లు ఉన్నాయని చెప్పి సైడైపోయింది. ఎందుకంటే... ఒకవేళ ఆమె సుధీర్‌తో కలిసి నటించి ఉంటే... ఆ సినిమా హిట్టై ఉంటే... అప్పుడు తమ మధ్య ఏదో ఉందనే ప్రచారం మరింత జోరందుకుంటుందనీ, అది తన ఫ్యూచర్‌ను దెబ్బతీస్తుందని భావించడం వల్లే రష్మీ సైడైపోయినట్లు తెలుస్తోంది. సుధీర్ హీరో అవ్వాలని కోరుకుంటూనే... అదే సమయంలో... తన కెరీర్ ప్రమాదంలో పడకుండా జాగ్రత్త పడుతోంది.

సాఫ్ట్‌వేర్ సుధీర్‌ సినిమాలో రష్మీ బదులు ధన్య బాలకృష్ణను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సజెషన్ చేసింది రష్మీ అనే తెలిసింది. సుధీర్ ఆఫర్‌ని తిరస్కరించిన రష్మీ... తను ఫీల్ అవ్వకుండా ఉండేందుకు ధన్య బాలకృష్ణ పేరును సూచించినట్లు తెలిసింది. ఇందుకు మరో కారణం ఉంది. ఈ ధన్య బాలకృష్ణ, రష్మీ ఇద్దరూ కలిసి... ఇంతకుముందు "తను వచ్చెనంట" అనే హర్రర్ మూవీలో నటించారు. అందులో రష్మీ దెయ్యం పాత్రను చేసింది. ఆ సినిమా టైంలో వాళ్లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తనకు దక్కని ఆఫర్... తన ఫ్రెండ్ ధన్యాకు దక్కితే బాగుంటుందని భావించిన రష్మీ... సుధీర్‌తో ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. దాంతో... రష్మీ మాట ప్రకారం... సుధీర్... ధన్య పేరును సజెస్ట్ చెయ్యడం... అందుకు నిర్మాత కూడా సరేనని అనడంతో... ఆమెను హీరోయిన్‌గా సెట్ చేశారని తెలుస్తోంది.

సుధీర్‌తో ర్యాపో వల్ల మొదట్లో కలిసొచ్చినా... ఇప్పుడు అదే ర్యాపో తన కెరీర్‌ని నాశనం చేస్తోందని రష్మీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ అసత్య ప్రచారం వల్లే తనకు టాలీవుడ్ నుంచీ సరైన ఆఫర్లు రాకుండా పోతున్నాయని రష్మీ భావిస్తున్నట్లు తెలిసింది. సుధీర్ వల్ల తన కెరీర్ దెబ్బతింటుందనే భయం లోలోన రష్మీకి ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అందువల్లే... బుల్లితెరపై ఎలా ఉన్నా... తెరవెనక మాత్రం సుధీర్‌కి రష్మీ దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో... సుధీర్ హర్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. 

మలబార్ అందాల స్వీట్ బ్యూటీ హనీ రోజ్ ఫొటోస్...Loading...
ఇవి కూడా చదవండి :

బెంగాల్‌పై బుల్‌బుల్ తుఫాను బీభత్సం... ఏడుగురు మృత్యువాత


ఆర్టీసీ సమ్మెపై నేడు ఫైనల్‌గా తేల్చనున్న హైకోర్టు...

క్లైమాక్స్‌కి మహారాష్ట్ర కహానీ... శివసేన సర్కార్ ఏర్పడే ఛాన్స్

ఏపీని ఆత్మహత్యలప్రదేశ్ చేశారు... వైసీపీపై చంద్రబాబు సెటైర్లు

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు

First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...