నా అందానికి కారణం ఆమే... సీక్రెట్ చెప్పిన అనసూయ

Jabardasth Anchor Anasuya : అందరిలా రొటీన్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం అనసూయకు అస్సలు నచ్చదు. మరి ఆమెను ఎప్పటికప్పుడు సరికొత్తగా చూపిస్తున్నది ఎవరు?

news18-telugu
Updated: December 15, 2019, 10:32 AM IST
నా అందానికి కారణం ఆమే... సీక్రెట్ చెప్పిన అనసూయ
అనసూయ (credit - insta - itsmeanasuya)
  • Share this:
Jabardasth Anchor Anasuya : జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో యాంకర్‌గా, సినీ నటిగా... అనసూయ భరద్వాజ్ తెలుగు వారందరికీ పరిచయమే. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఆమె... తెరపై గ్లామరస్ లుక్‌తో కనిపిస్తుండటానికి బాడీ ఫిట్‌నెస్‌తోపాటూ... కాస్ట్యూమ్స్ కూడా కారణమే అంటారు ఆమె అభిమానులు. ఐతే... తన పర్సనల్ విషయాల్ని పెద్దగా ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడని అనుసూయకు అదిరిపోయే కాస్ట్సూమ్స్ ఎవరు తయారుచేస్తున్నారన్న ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అనసూయను అంత అందంగా, ఎప్పటికప్పుడు సరికొత్తగా, క్రియేటివ్‌గా చూపించే అమ్మాయి ఎవరో కాదు... గౌరీ నాయుడు. సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజనర్ అయిన ఈ 29న ఏళ్ల బ్యూటీ... టాలీవుడ్‌లో చాలా తెలుగు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తోంది. 2009లో ఒక మనసు సినిమాలో లీడ్ రోల్ చేసిన నిహారికా కొణిదెలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ఆ తర్వాత 2017లో ఖైదీ నంబర్ 150 సినిమాకి మెగాస్టార్ చిరంజీవికి అసిస్టెంట్ స్టైలిస్ట్‌గా చేశారు. ఇక 2018లో రంగస్థలం సినిమాకి హీరో రాం చరణ్‌కి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ప్రస్తుతం పేరు పెట్టని మరో ప్రాజెక్టుకు వర్క్ చేస్తున్నారు.
రాజమండ్రిలో పుట్టిన గౌరీ నాయుడు... విశాఖలో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ... హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేసిన గౌరీ... త్వరగానే ఫేమ్ తెచ్చున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షోకి కూడా ఆమే కాస్ట్యూమ్స్ సెట్ చేశారు. ఇటీవల ఆమె హరీష్ శంకర్ ఆల్బం జైహో తెలంగాణకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్‌తోపాటూ... హరి తేజకు కూడా కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు.ఇలా గౌరీ నాయుడు... క్రమక్రమంగా తన కెరీర్‌ను డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఐతే... అనసూయకు ఆమె ఇస్తున్న కాస్ట్యూమ్స్‌పై పెద్ద చర్చే జరుగుతోంది. చాలా క్రియేటివ్‌గా ఉంటున్న వాటి ద్వారా అనసూయ మరింత గ్లామరస్‌గా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.Pics : అందాల విందు చేస్తున్న అన్వేషి జైన్
ఇవి కూడా చదవండి :ఎన్‌కౌంటర్‌పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

"హ్యాట్"ట్రిక్ అదిరిందిగా... ట్విట్టర్‌లో వైరలే వైరల్...

CISF ఆఫీసర్ అరెస్ట్... చివర్లో ట్విస్ట్...

ట్రంప్ గెలుపు బాలీవుడ్ సినిమాలా ఉంటుందన్న జూనియర్ ట్రంప్

నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు
Published by: Krishna Kumar N
First published: December 15, 2019, 10:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading