అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాదు ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కించేంతగా ఆమె క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా అనసూయ.. స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో రెచ్చిపోయి విశ్వరూపం చూపిస్తోంది.ప్రస్తుతం అనసూయ.. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కూడా అనసూయ పాత్రే కథకు కీలకం అని చెబుతున్నారు. తాజాగా అనసూయ స్టార్ మా ఓంకార్ యాంకరింగ్‌లో ప్రసారమయ్యే 6th సెన్స్ 3 ప్రోగ్రమ్లో స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసింది. అంతేకాదు అక్కడ అలనాటి శ్రీదేవి, తాజాగా పూజా హెగ్డే చేసిన వెల్లువచ్చే గోదారమ్మ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేసి ఇరగదీసి అందరు అవాక్కయ్యేలా చేసింది. మొత్తంగా జబర్దస్త్ కామెడీషోలనే కాకుండా.. వేరే ప్రోగ్రామ్స్‌తో అనసూయ వేరే దర్శక, నిర్మాతలకు తన టాలెంట్ ఏందో చూపెడుతోంది.
Entertaining episode of #SixthSense3 with @anusuyakhasba & #SekharMaster ...Today at 9 PM on @StarMaa pic.twitter.com/szExFsZd4h
— STAR MAA (@StarMaa) February 9, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood