అనసూయ మెచ్చిన డాన్సర్‌ను చూసారా... చూస్తే కళ్లు తిప్పుకోలేరు..

అనసూయ భరద్వాజ్ (Image: Anasuya Bharadwaj/Facebook)

జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఈ భామ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఈ షోతో గుర్తింపు తెచ్చుకున్న  తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటించినా అంతగా గుర్తింపు రాని అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఒక్కసారిగా అనసూయకు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు  ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు ఈ చిత్రంలోని నటనకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం కూడా అందుకుంది. కేవలం జబర్దస్త్ కామెడీ షో, లోకల్ గ్యాంగ్స్ వంటి షోస్‌తో తన సత్తా చూపెట్టింది. అనసూయ కేవలం సినిమాలకే కాదు.. సమాజంలో జరిగే పరిణామాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ.. ఒకతను టిక్‌టాక్ వీడియోలో చేసిన డాన్స్‌ను అనసూయ భరద్వాజ్.. తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసి.. ఆ డాన్సర్‌ను ఆకాశానికెత్తేసింది. మరోవైపు ఇదే వీడియోను హృతిక్ రోషన్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ వీడియోను షేర్ చేసారు. మొత్తానికి టిక్‌టాక్ వీడియోలో పలు పాటలకు చేసిన నృత్యాలను ఒక వీడియోగా చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.    Published by:Kiran Kumar Thanjavur
    First published: