• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • JABARDASTH COMEDY SHOW ANCHOR ANASUYA BHARADWAJ SAYS HER FAVOURITE WEB SERIES TA

Anasuya: ఇక నుంచి అనసూయ ఫేవరేట్ వెబ్ సిరీస్ అదేనట..

అనసూయ (Instagram/photo)

హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైంది. అంతేకాదు ఇంట్లో తను చేసిన పనులకు సంబంధించి వాటిని ఎప్పటి కప్పుడు సోషల్ మీడియలో అభిమానులతో షేర్ చేస్తోంది. తాజాగా అనసూయ.. తాను చూసిన ఓ వెబ్ సిరీస్‌ను మెచ్చుకుంది.

  • Share this:
    హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైంది. అంతేకాదు ఇంట్లో తను చేసిన పనులకు సంబంధించి వాటిని ఎప్పటి కప్పుడు సోషల్ మీడియలో అభిమానులతో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త వంటకాలు ఎలా చేయాలో చేసి చూపిస్తోంది. అంతేకాదు ఈ ఖాళీ టైమ్‌ను అనసూయ బాగానే యూటిలైజ్ చేసుకుంటుంది. ఇంట్లోనే ఉండటంతో పాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను చూస్తోంది. తాజాగా ఈమె బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ‘క్లీన్ స్లేట్’ బ్యానర్‌‌లో ‘పాతాళ్ లోక్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ నిర్మించింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సిరీస్‌పై తెలుగు యాంకర్ ప్రశంసలు కురిపించింది. ‘పాతాళ్ లోక్’ అనే వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా  ఉంది. ఇప్పటి వరకు తాను చూసిన వెబ్ సిరీస్‌లో ఇదే తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో నటీనటుల మేకింగ్, మేకింగ్ అన్ని అదిరిపోయానని అనసూయ చెప్పుకొచ్చింది. సిరీస్‌ను కూడా అద్భుతమైన ఎండింగ్‌తో పూర్తి చేసారంది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్ సిరీస్ అంటూ చెప్పింది. తాజాగా అనసూయ .. బిగ్‌బాస్‌ 4 లో భారీ ఆఫర్ వచ్చినా.. తనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఒప్పుకోలేదని సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: