అనసూయ జబర్ధస్త్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయితే తిరుగుండదు..

Anasuya Bharadwaj | అవును తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్ అనపూయ ఇపుడో జబర్ధస్త్ మాస్టర్ ప్లాన్ వేసింది. అది వర్కౌట్ అయితే ఆమెకు తిరుగుండదు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 2, 2020, 2:36 PM IST
అనసూయ జబర్ధస్త్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయితే తిరుగుండదు..
అనసూయ (Anasuya Bharadwaj)
  • Share this:
అవును తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్ అనపూయ ఇపుడో జబర్ధస్త్ మాస్టర్ ప్లాన్ వేసింది. అది వర్కౌట్ అయితే ఆమెకు తిరుగుండదు. వివరాల్లోకి వెళితే.. తెలుగు టీవీ తెరపై తనదైన అందా చందాలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించిన అనసూయ అంటే దాదాపు తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. అనసూయ కేవలం టీవీ తెరకు పరిమితం కాలేదు. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ముఖ్యంగా నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో ఆమె హుషారైన నటన అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత ‘క్షణం’లో విలన్‌గా, రామ్ చరణ్.. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా కంటి తడిపెట్టించే పాత్రలతో తనలోని నటిని ఎలివేట్ అయింది. ప్రస్తుతం తెలుగు దర్శక,నిర్మాతలు అనసూయను దృష్టిలో పెట్టుకొని పలు స్టోరీలను రెడీ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీలో కూడా ఈమె ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటిని పక్కన పెడితే.. అనసూయ త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టబోతుంది. దాంతో పాటు నిర్మాతగా కూడా లక్ పరీక్షించుకోవాలని చూస్తుంది. అది సినిమాల పరంగా కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఆమె నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లను నిర్మించే ఆలోచనలో అనసూయ ఉన్నట్టు సమాచారం.

అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)


ఇప్పటికే ఆమె దీని కోసం ఒక టీమ్‌ను కూడా రెడీ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ బిజినెస్ అంతగా లేదు. అందరు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్  చేసుకుంటున్నారు. అందుకే అనసూయ తన అడుగులను ఓటీటీ వైపు  వేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అనసూయ భరద్వాజ్ ..కొత్త కథలతో వెబ్ సిరీస్‌లను నిర్మించాలనే ఆలోచన నిజంగా మెచ్చుకోతగిందే.
First published: July 2, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading