ఫైర్ బ్రాండ్ రోజాపై అనసూయ జబర్దస్త్ పంచ్ .. అవాక్కయిన ఫ్యాన్స్..

తెలుగు లోగిళ్లలో ఉన్న వాళ్లకు అనసూయ అంటే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా అనసూయ  ఫైర్ బ్రాండ్  రోజా మీద కూడా పంచ్ డైలాగ్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: January 17, 2020, 5:05 PM IST
ఫైర్ బ్రాండ్ రోజాపై అనసూయ జబర్దస్త్ పంచ్ .. అవాక్కయిన ఫ్యాన్స్..
రోజా,అనసూయ (File Photos)
  • Share this:
తెలుగు లోగిళ్లలో ఉన్న వాళ్లకు అనసూయ అంటే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా సత్తా చూపెడుతోంది. ఇక వయసు 40 చేరువైనా.. గ్లామర్ విషయంలో ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటెన్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈమధ్యనే  ఈ భామ తన గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. జబర్దస్త్‌లో యాంకర్‌గా ఆమె ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా జీ తెలుగులో లోకల్ గ్యాంగ్ అనే ప్రోగ్రామ్ చేస్తుంది అనసూయ. యాంకర్ స్థాయి నుండి జడ్జికి ప్రమోట్ కావడంతో ఆరబోత రేంజ్‌ను కూడా పెంచింది. ఈ షో లో తన విశ్వరూపం చూపిస్తున్న అనసూయ అటు డాన్స్ , ఇటు తన తరహా పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటోంది. ఐతే.. తాజాగా విడుదలైన లోకల్ గ్యాంగ్ ప్రోమోలో అనసూయ  ఫైర్ బ్రాండ్  రోజా మీద కూడా పంచ్ డైలాగ్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఐతే రోజాపై కాస్త వ్యంగ్యంగా  ఆ తరహా డైలాగ్లు సరదా కోసమే వేసినా.. అంతగా నోరు జారాల్సిన అవసరం ఉండా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

(Image: Anasuya Bharadwaj/Facebook)


శేఖర్ మాస్టర్ వేరే షోకు వెళ్లిపోయిన వేళ.. ఇక మన మాస్టర్ అన్నది ఉండదని ప్రదీప్ అంటే.. దానికి అనసూయ అం.. ఆ: వరకూ వెళ్లిందని కల్పించుకున్నారు. ఈ విషయం మీద రేపు మధ్యాహ్నం చర్చిద్దామని ఫోన్లో చెప్పినట్లుగా యాంకర్ ప్రదీప్ అంటే.. దానికి స్పందించిన అనసూయ.. యాంకరింగా? పక్కన పార్టీ లోనా? అంటూ నవ్వుతూ మాట కట్ చేశారు? దీనికి శేఖర్ మాస్టర్ ఎక్స్ ప్రెషన్ చూసినప్పుడు.. అంత సాహసం చేశావేంటి అనసూయ అన్నట్లుగా ఉంది. ఏదేమైనా అనసూయ అభిమానులు మాత్రం ప్రజా జీవితంలో ఉన్న వారి మీద.. వాళ్లకు సంబంధించిన విషయాలని తొందరపడి అనకూడదు. ఇలాంటి మాటలతో లేనిపోని తలనొప్పులు ఖాయం అని అనసూయకు హితవు పలుకుతున్నారు.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు