Home /News /movies /

JABARDASTH COMEDY SHOW ANCHOR ANASUYA BHARADWAJ CRY THAT INCIDENTS HERE ARE THE DETAILS TA

Anasuya Bharadwaj: ఆ సంఘటనతో వెక్కి వెక్కి ఏడ్చేసిన జబర్ధస్త్ భామ అనసూయ భరద్వాజ్..

అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)

అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)

Anasuya Bharadwaj:  ప్రతి వ్యక్తి జీవితంలో ఏవోొ అనుకోని కొన్ని సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. దీనికి ఎవరు అతీతలు కారు. తాజాగా అనసూయ భరద్వాజ్ అలాంటి ఓ సంఘటనను గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

    Anasuya Bharadwaj:  ప్రతి వ్యక్తి జీవితంలో ఏవోొ అనుకోని కొన్ని సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. దీనికి ఎవరు అతీతలు కారు. ఒకప్పుడు అమితాబ్ వాయిస్ బాగా లేదన్నవారే..  ఆ తర్వాత ఆ గొంతుకు ప్రేక్షకులు దాసోహం అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎదిగే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఘటనలు అనేకం ఉంటూనే ఉంటాయి. ఇక జబర్ధస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ కూడా ఇలాంటి సంఘటనలే ఎన్నో ఫేస్ చేసింది. తాజాగా ఈమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఇబ్బందులను గురి చేసిన సంఘటనలు గుర్తు చేసుకుంది. తాను వేసుకునే డ్రెస్ పై నెటిజన్లు కూడా పలు కామెంట్స్ చేసారు. మరోవైపు తన పెద్ద కుమారుడు తాను వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటే.. బాగుండదని.. పొడువు దుస్తులు వేసుకోమని చెబుతూ ఉంటారని చెప్పుకొచ్చింది.

    ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్నాను అని అనసూయ తెలిపారు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తనకు ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాను. ఓ సారి నాకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అలాంటి సందర్భాల్లో తాను ఎంతో బాధ పడ్డాను. అలాంటి సమయంలో తన భర్త తనను ఎంతో ఓదార్చే వారని తెలిపారు. అలాంటి సమయంలో తన బాధను మరిచిపోవడానికి వైన్‌ను ఎంతో అరుదుగా తాగుతుంటాను అని అనసూయ వివరించారు.

    Anasuya son
    అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)


    ఇక అనసూయ పాపులారిటీ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. పక్కనున్న భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం భీష్మ పర్వంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మరోవైపు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఈ భామను ఎంపిక చేసినట్టు సమాచారం. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు