యాంకర్ ప్రదీప్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన అనసూయ..

స్మాల్ స్క్రీన్ పై మేల్ యంకర్‌గా దూసుకుపోతున్న ప్రదీప్ మాచిరాజుకు.. మరో ఫీమేల్ యాంకర్ అనసూయ ఆల్ ది బెస్ట్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 29, 2020, 4:51 PM IST
యాంకర్ ప్రదీప్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన అనసూయ..
యాంకర్ ప్రదీప్, అనసూయ (File/Photos)
  • Share this:
తెలుగు టీవీ చరిత్రలో ఎంతో మంది యాంకర్లు ఉన్నా అత్యంత గుర్తింపును దక్కించుకున్న వాళ్లు మాత్రం కొద్ది మందే ఉన్నారు. అందులోనూ మగ యాంకర్లనైతే వేళ్లపై లెక్కించవచ్చు. వీరిలో ప్రదీప్ మాచిరాజు ముందు వరసలో ఉంటాడు. దీనికి కారణం అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే. ప్రస్తుతం ఈ యంగ్ యాంకర్ ఎన్నో షోలతో బిజీగా గడుపుతున్నాడు. అయితే స్మాల్ స్క్రీన్ మీద సత్తా చాటి వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకున్నవారు కొద్ది మందే ఉన్నారు. యాంకర్‌లుగా అలరిస్తున్న అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వారు సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా ఇటీవలె ‘సాఫ్ట్ వేర్‌ సుధీర్’గా  వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా ‘ త్రీ మంకీస్’ సినిమాతో త్వరలో పలకరించబోతున్నాాడు. ఈయన రూట్లోనే యాంకర్ ప్రదీప్ హీరోగా ప్రమోషన్ పొందాడు. ఈయన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా .. ? అనే రొమాంటిక్ కామెడీ  సినిమా చేసాడు. ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా  పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన ఈ సినిమాకు కథ మాటలు కూడా అందిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రానా విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా.

jabardasth comedy show anchor anasuya bharadwaj all the best to anchor pradeep machiraju,pradeep machiraju,anasuya bharadwaj,jabardasth comedy show,anasuya bharadwaj jabardasth comedy show,anchor predeep,anchor predeep debut movie,anchor predeep 30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela first look released,rana anchor pradeep,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,30 రోజుల్లో ప్రేమించడం ఎలా,ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ,ప్రదీప్ మాచిరాజు
30 రోజుల్లో ప్రేమించడం ఎలా (Twitter/Photo)


తాజాగా  ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా' పోస్టర్ చూసిన అనసూయ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది. ''ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ ప్రదీప్. నీ లుక్ చాలా బాగుంది. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నీవు హీరోగా మారడం చాలా గర్వంగా ఉంది'' అని పేర్కొంది.


కాగా ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై సక్సెస్‌ఫుల్ కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు