Anasuya Bharadwaj | అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా టీవీ తెరకు పరిచయం అయిన ఈ హాట్ యాంకర్.. అనతి కాలంలోనే అత్యంత భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. చాలా ఏళ్లుగా ఈ షోను హోస్ట్ చేస్తున్న అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. అందుకే ఆమెను తమ సినిమాల్లో ముఖ్యపాత్రల కోసం దర్శక, నిర్మాతలు సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా తర్వాత అనసూయ ఇమేజ్ మారిపోయింది. సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తున్న ఇప్పటికీ ఆమెను చూసి రంగమ్మత్త అనే చాలా మంది అంటున్నారంటే ఆ పాత్రలో ఆమె ఎంతలా ఒదిగిపోయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సుకుమార్ ఇపుడు చేయబోతున్న అల్లు అర్జున్ సినిమాలో కూడా అనసూయకు ఒక ప్రముఖ పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది.
రంగస్థలంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే ఇందులో నెగటివ్ ఛాయలున్న పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.ఇది కాకుండా అనసూయ మరో ఆసక్తికర పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ ఇప్పుడు 'భీష్మ' సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా విజయం సాధించిన కొన్ని రోజులకే తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమా రీమేక్ చేస్తున్నాడు నితిన్. జూన్ నుండి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఒక బోల్డ్ పాత్రకు అనసూయను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంధధూన్ లో టబు పోషించిన పాత్రను తెలుగులో అనసూయకు ఆఫర్ చేశారట.డిసెంబర్ కల్లా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. పాత్ర పరంగా కూడా బోల్డ్ గా ఉన్న ఈ చిత్రంలో అనసూయ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Nithiin, Telugu Cinema, Tollywood