Home /News /movies /

JABARDASTH COMEDY SHOW ANASUYA BHARADWAJ GOT ANOTHER BUMPER OFFER TA

అనసూయ భరద్వాజ్‌కు మరో బంపరాఫర్.. ఆ హీరోయిన్ ప్లేస్ కొట్టేసిన జబర్ధస్త్ భామ..

అనసూయ (Anasuya Bharadwaj/Youtube)

అనసూయ (Anasuya Bharadwaj/Youtube)

తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్ అనసూయకు మరో బంపరాఫర్ వచ్చింది. తెలుగు టీవీ తెరపై తనదైన అందా చందాలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించిన అనసూయ అంటే...

    తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్ అనసూయకు మరో బంపరాఫర్ వచ్చింది. తెలుగు టీవీ తెరపై తనదైన అందా చందాలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించిన అనసూయ అంటే దాదాపు తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. అనసూయ కేవలం టీవీ తెరకు పరిమితం కాలేదు. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలాంటి ఈ భామకు మరో బంపరాఫర్ వచ్చింది. ముఖ్యంగా నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో ఆమె హుషారైన నటన అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత ‘క్షణం’లో విలన్‌గా, రామ్ చరణ్.. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా కంటి తడిపెట్టించే పాత్రలతో తనలోని నటిని ఎలివేట్ అయింది. ప్రస్తుతం తెలుగు దర్శక,నిర్మాతలు అనసూయను దృష్టిలో పెట్టుకొని పలు స్టోరీలను రెడీ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీలో కూడా ఈమె ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమెకు ఓ సినిమాలో మంచి పాత్ర ఆఫర్ వచ్చిందట.

    anchor anasuya news,anchor anasuya films,Jabardasth anchor anasuya,anchor anasuya,jabardasth anchor anasuya,jabardasth,anasuya,anasuya bharadwaj,anasuya and rashmi reaction,hyper aadi,jabardasth anasuya,extra jabardasth,jabardasth hyper aadi,jabardasth comedy show,anasuya husband fires on hyper aadi,anasuya and rashmi,hyper aadi jabardasth,anasuya hyper aadi dance,anchor anasuya shocking reaction on hyper aadi,hyper aadi punches,hyper aadi on orphans,anasuya dance,జబర్దస్త్,అనసూయ
    అనసూయ Photo : Twitter


    కరోనా ఎఫెక్ట్‌తో వేరే భాషల నటులు మన తెలుగు సినిమాల్లో చేసే అవకాశం లేకుండా పోయింది. తాజాగా నటి ఇంద్రజకు ఓ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం ఈమె చెన్నైలో ఉంటుంది. ఈమె సుమంత్ అశ్విన్ హీరోగా గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కీలక పాత్రలో నటించాల్సి ఉంది. కరోనా కారణంగా ఈమె ఈ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఈమె ప్లేస్‌లో అనసూయ‌ను తీసుకున్నట్టు సమాచారం. ఈ పాత్రలో అనసూయ యాక్ట్ చేస్తుండటంతో నిర్మాతలు ఆమెకు కాస్తా ఎక్కువగానే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. మొత్తంగా అనసూయ యాక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు