హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer - Hyper Aadi: సుడిగాలి సుధీర్, హైపర్ ఆది పెళ్లి ఫిక్స్.. అమ్మాయిలు ఎవరో తెలుసా..?

Sudigali Sudheer - Hyper Aadi: సుడిగాలి సుధీర్, హైపర్ ఆది పెళ్లి ఫిక్స్.. అమ్మాయిలు ఎవరో తెలుసా..?

అందుకే జబర్దస్త్ అంటే వాళ్లకు కూడా పంచ ప్రాణాలు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై కామెడీని పంచుతూ రేటింగ్స్ పరంగా ఒకప్పుడు సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా ఈ షో నుంచి బాగానే సంపాదించింది. ఒకప్పుడు బుల్లితెర కనీసం చూడనటువంటి టిఆర్పీలు తీసుకొచ్చింది జబర్దస్త్ కామెడీ షో. కేవలం ఈ షో కారణంగా పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో రాణిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

Sudigali Sudheer - Hyper Aadi: తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer). వయసు 33 వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు సుధీర్. మరోవైపు 30లోకి వచ్చిన హైపర్ ఆది(Hyper Aadi) కూడా ఇప్పటి వరకు నో పెళ్లి అంటున్నాడు.

ఇంకా చదవండి ...

తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వయసు 33 వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు సుధీర్. మరోవైపు 30లోకి వచ్చిన హైపర్ ఆది కూడా ఇప్పటి వరకు నో పెళ్లి అంటున్నాడు. ఈ ఇద్దరు కమెడియన్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరూ ఒకేసారి పెళ్లి బట్టల్లో కనిపించారు. ఒకే ముహూర్తంలో తాళి కట్టడానికి సిద్ధమైపోయారు. అయితే ఇదంతా నిజం మాత్రం కాదు.. జబర్దస్త్ కామెడీ షోలో ఎప్పట్లాగే మరోసారి పెళ్లి సందడి మొదలైంది. మొన్నటికి మొన్న వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసారు మల్లెమాల ప్రొడక్షన్స్. టిఆర్పీ రేటింగ్స్ కోసం ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్లకు ముడి పెట్టేస్తున్నారు షో దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఇప్పుడు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌లకు సైతం వాళ్ల జోడీతోనే పెళ్లి చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్‌లో సుధీర్‌కు రష్మి.. హైపర్ ఆదికి దీపిక పిల్లి జంటగా ఉన్నారు. అక్కడ వాళ్లు చేసే అల్లరి మామూలుగా ఉండదు కూడా.

సుధీర్, రష్మి రేంజ్‌లో కాకపోయినా ఆది, దీపిక జోడీకి కూడా మంచి క్రేజ్ ఉంది బయట. అందుకే ఇప్పుడు తన స్కిట్ కోసం ఇదంతా వాడేసుకున్నాడు హైపర్ ఆది. తాజాగా జబర్దస్త్ ప్రోమోలో సుధీర్, ఆది పెళ్లి బట్టల్లో దర్శనమిచ్చారు. ఇద్దరూ పెళ్లి కొడుకుల్లా ముస్తాబై.. మూడు ముళ్లు వేయడానికి సిద్ధమైపోయారు. అది కూడా ఎవరో కాదు.. రష్మి, దీపిక పిల్లితోనే పెళ్లికి రెడీ అయిపోయారు.

' isDesktop="true" id="949126" youtubeid="ZAhJNbDPRhg" category="movies">

హైపర్ ఆది స్కిట్‌లో భాగంగా రష్మి, దీపిక కూడా పెళ్లి కూతురులా ముస్తాబై స్టేజీ మీదకు వచ్చారు. వాళ్లను మోసుకుంటూ వచ్చారు భటులు. రాజ కుటుంబంలో జరిగే పెళ్లిలా దీన్ని డిజైన్ చేసారు. ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుందిప్పుడు. ఏదేమైనా కూడా ట్రెండింగ్‌లో ఉన్న సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్ళను ఎప్పుడు వాడుకున్నా కూడా అదిరిపోయే రేటింగ్ వస్తుందని జబర్దస్త్ నిర్వాహకులకు తెలియని విషయం కాదు. అందుకే మరోసారి అదే అప్లై చేస్తున్నారు.

First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు