Home /News /movies /

JABARDASTH COMEDIANS HYPER AADI TEAM MATES DORABABU EVICTED FROM SHOW MK

జబర్దస్త్‌ను వీడని సెక్స్ రాకెట్ వివాదం...హైపర్ ఆదికి భారీ షాక్...

దొరబాబు,  హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

దొరబాబును మొదటి నుంచి ప్రోత్సహించి అతడికి మంచి పేరు తేవడంలో హైపర్ ఆది కృషి ఉంది. మొదటి నుంచి స్కిట్స్ లో దొరబాబును స్త్రీలోలుడిగా చూపించేవాడు. అయితే నిజజీవితంలో కూడా దొరబాబు అలాంటి వాడనే ప్రూవ్ కావడంతో హైపర్ ఆది తల పట్టుకున్నాడు.

ఇంకా చదవండి ...
    జబర్దస్త్ కామెడీ షోను సెక్స్ రాకెట్ వివాదం కలకలం రేపుతోంది. దొరబాబు, పరదేశీ ఇప్పటికే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా, హైపర్ ఆదికి తలవంపులు తెచ్చిపెట్టింది. నిజానికి దొరబాబును మొదటి నుంచి ప్రోత్సహించి అతడికి మంచి పేరు తేవడంలో హైపర్ ఆది కృషి ఉంది. మొదటి నుంచి స్కిట్స్ లో దొరబాబును స్త్రీలోలుడిగా చూపించేవాడు. అయితే నిజజీవితంలో కూడా దొరబాబు అలాంటి వాడనే ప్రూవ్ కావడంతో హైపర్ ఆది తల పట్టుకున్నాడు. అయితే మొదటి నుంచి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొన్న హైపర్ ఆది టీమ్ మెంబర్స్ పై వేటు వేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది టీమ్ నుంచి దొరబాబు, పరదేశీ ఔట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మల్లెమాల ప్రొడక్షన్ ఈ వివాదంపై సీరియస్ యాక్షన్ తీసుకుందనే చెప్పాలి. కాగా గతంలో సైతం కొందరు ఆర్టిస్టులు క్రమశిక్షణ ఉల్లంఘించగా, వాళ్లకు ఎంత క్రేజ్ ఉన్నా పట్టించుకోకుండా, మల్లెమాల పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. ముందు ముందు దొరబాబు తరహా ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా, మల్లెమాల ఇలా జాగ్రత్త పడుతుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు