నాగబాబుకు భారీ షాక్.. హ్యాండిచ్చిన జబర్దస్త్ కమెడియన్లు..

Jabardasth : తన వెంట వస్తారనుకున్న వాళ్లు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో నాగబాబు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు సన్నిహితంగా ఉండి, ఇప్పుడు ఇలా చేశారేంటని మదన పడుతున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: December 8, 2019, 3:56 PM IST
నాగబాబుకు భారీ షాక్.. హ్యాండిచ్చిన జబర్దస్త్ కమెడియన్లు..
నాగబాబు (file photo)
  • Share this:
జబర్దస్త్‌కు పోటీగా వేరే ఛానల్‌లో కొత్త ప్రోగ్రాం రావడంతో నాగబాబుతో పాటు చాలా మంది జబర్దస్త్ కమెడియన్లు, యాంకర్ అనసూయ జంప్ అవుతారని ఊహించారు. ఆ ఊహాగానాలను బలపరుస్తూ కొందరు ఆర్టిస్టులు, యాంకర్ అనసూయ కొత్త ప్రోగ్రాంలో కనిపించారు. దీంతో జబర్దస్త్ పని అయిపోయినట్లేనని అనుకున్నారు. జబర్దస్త్‌లో ఉన్నంతసేపు నాగబాబు జపం చేయడంతో ఆయన కూడా ఆర్టిస్టులంతా తన మాట వింటారని, తనతో నడుస్తారని అనుకున్నారు. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ నాగబాబుతో కలిసి కొత్త షోకు వెళ్లిపోయారు కూడా. కానీ.. ఇంతలోనే నాగబాబుకు పెద్ద షాక్ ఇచ్చారు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. జబర్దస్త్‌ను వీడాలంటే లీగల్ సమస్యలు ఉన్నాయని గ్రహించి.. కొత్త ప్రోగ్రాంకు వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నారు. వారితో పాటు కొందరు ఆర్టిస్టులు కూడా తమ భవిష్యత్తు దృష్ట్యా జబర్దస్త్‌లోనే కంటిన్యూ అయ్యారు.

అంతేకాదు.. కొత్త ప్రోగ్రాంకు వెళ్లిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వెంటనే తిరిగి జబర్దస్త్ గూటికి వచ్చేశారు. దీంతో.. తన వెంట వస్తారనుకున్న వాళ్లు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో నాగబాబు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు సన్నిహితంగా ఉండి, ఇప్పుడు ఇలా చేశారేంటని మదన పడుతున్నట్లు సమాచారం.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>