Home /News /movies /

JABARDASTH COMEDIANS FULL SUPPORT FOR AVINASH IN BIGG BOSS 4 TELUGU HOUSE PK

Jabaardasth Avinash: అవినాష్ కోసం కదిలొస్తున్న జబర్దస్త్ గ్యాంగ్.. అతన్ని విన్నర్‌గా చూడాలంటూ..

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

Jabardasth Avinash: జబర్దస్త్ కామెడీ షో నుంచి బిగ్ బాస్ వరకు అవినాష్ ప్రయాణం అద్భుతమే. జీరో నుంచి హీరో అయ్యాడు ఈయన. కుటుంబం కోసం ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు.

జబర్దస్త్ కామెడీ షో నుంచి బిగ్ బాస్ వరకు అవినాష్ ప్రయాణం అద్భుతమే. జీరో నుంచి హీరో అయ్యాడు ఈయన. కుటుంబం కోసం ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్‌లో కూడా అవినాష్ దూసుకుపోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా మనోడి దూకుడు మాత్రం మామూలుగా లేదు. అందరితో కలిసిపోతూ రప్ఫాడిస్తున్నాడు. నవ్వుతూ నవ్విస్తూ నామినేషన్స్‌కు దొరక్కుండా వస్తున్నాడు అవినాష్. కానీ ఈ సేఫ్ గేమ్స్ ఎక్కువ రోజులు సాగవు.. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అవినాష్ కూడా నామినేషన్స్‌లోకి వస్తున్నాడు. మొన్న రెండు వారాలు కంటిన్యూగా నామినేట్ అయ్యాడు అవినాష్. మళ్లీ సేవ్ అయ్యాడు కూడా. ఈ వారం నామినేట్ కాలేదు ఈ జబర్దస్త్ కమెడియన్. అయితే ఈయన నామినేట్ అయినా కాకపోయినా జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం రంగంలోకి దిగుతున్నారు. తమ తోటి కమెడియన్ కావడంతో ఆయన కోసం ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అవినాష్‌కు అండగా నిలబడుతున్నారు. దయచేసి అవినాష్‌కు సపోర్ట్ చేయండి.. ఓట్లు వేయండి అంటూ ప్రమోట్ చేస్తున్నారు.
jabardasth avinash,jabardasth avinash suicide plans,jabardasth avinash suicide ariyana,jabardasth avinash bigg boss 4 telugu,jabardasth avinash crying,jabardasth avinash crying in bigg boss 4 telugu,jabardasth avinash ariyana,telugu cinema,జబర్దస్త్ అవినాష్,బిగ్ బాస్ 4 అవినాష్,జబర్దస్త్ అవినాష్ ఏడుపు,జబర్దస్త్ అవినాష్ ఆత్మహత్య ఆలోచన
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

ఫేస్ బుక్, ట్విట్టర్ అని తేడా లేకుండా అన్నిచోట్లా అవినాష్‌కు సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు. మొన్నామధ్య రాకింగ్ రాకేష్ ఫేస్ బుక్‌లో అవినాష్ కోసం పోస్ట్ పెట్టాడు. ఓట్ ఫర్ అవినాష్ అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో పాటు మిగిలిన వాళ్లు కూడా ఇదే చేస్తున్నారు. తమలో ఒకడైన అవినాష్ కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ గెలవాలని వాళ్లు కోరుకుంటున్నారు. కచ్చితంగా అతడికి ఓటేసి సేవ్ చేయండి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నామినేషన్స్‌లో లేకపోయినా కూడా తర్వాత వచ్చినపుడు సేవ్ చేయమని కోరుతున్నారు. మిగిలిన వాళ్లతో పోలిస్తే కచ్చితంగా అవినాష్‌కు ఓట్లు ఎక్కువ పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న వాళ్లలో మనోడికి ఇమేజ్ చాలా ఉంది. ఆ లెక్కన అవినాష్ టాప్ 5లోకి ఈజీగా వస్తాడు.జ దానికితోడు జబర్దస్త్ టీమ్స్ కూడా సపోర్ట్ చేయడంతో అవినాష్ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. మరి ఈ క్రేజ్‌తో టైటిల్ గెలుస్తాడా లేదా చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth avinash, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు