జబర్దస్త్ కామెడీ షోకు కరోనా టెన్షన్.. క్షణక్షణం భయం భయం..

Jabardasth Comedy Show: కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఇండియాను వణికిస్తుంది ఈ వైరస్. ఇప్పటికే ప్రపంచంలో మూడో స్థానానికి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 5:17 PM IST
జబర్దస్త్ కామెడీ షోకు కరోనా టెన్షన్.. క్షణక్షణం భయం భయం..
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఇండియాను వణికిస్తుంది ఈ వైరస్. ఇప్పటికే ప్రపంచంలో మూడో స్థానానికి ఎగబాకింది భారత్. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీని కూడా చావుదెబ్బ కొట్టింది కరోనా వైరస్. కోవిడ్ దెబ్బకు ఎక్కడి వాళ్లు అక్కడే గప్‌చుప్ అయిపోయారు. సినిమా వాళ్లు అయితే ఇంటికే పరిమితం అయిపోయారు. ఇదిలా ఉంటే టీవీ ఇండస్ట్రీ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సీరియల్స్‌తో పాటు షోలు కూడా మొదలైపోయాయి. కానీ కరోనా వాళ్లపై కూడా విచక్షణ లేకుండా దాడి చేస్తుంది.
ప్రతీతాత్మక చిత్రం
ప్రతీతాత్మక చిత్రం


తెలుగు టెలివిజన్ హిస్టరీలో చాలా మందికి ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా మరో ఇద్దరికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోకు కూడా కరోనా భయం మొదలైపోయింది. ఎందుకంటే నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో జబర్దస్త్ దూసుకుపోతుంది. రేటింగ్స్ కూడా భారీగానే వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఫ్రెష్ ఎపిసోడ్స్ రావడంతో టిఆర్పీ కూడా దుమ్ము దులిపేస్తుంది. అయితే కరోనా వైరస్ భయం మాత్రం వాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.
హైపర్ ఆది (Hyper Aadi)
హైపర్ ఆది (Hyper Aadi)

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జబర్దస్త్ కమెడియన్స్ కూడా కోవిడ్ ఎక్కడ తమపై అటాక్ చేస్తుందో అని వణికిపోతున్నారు. షూటింగ్స్‌కు కూడా బిక్కుబిక్కుమంటూనే వస్తున్నారు. కొందరు కొన్ని షెడ్యూల్స్ డుమ్మా కూడా కొడుతున్నారు. గత ఎపిసోడ్‌లో హైపర్ ఆది సహా మరో ఇద్దరు కూడా రాలేదు. మళ్లీ వచ్చేవారం వచ్చేస్తున్నారు. తెలుగులో మోస్ట్ పాపులర్ కామెడీ షోగా ఉన్న జబర్దస్త్‌ను కరోనా మాత్రం భయపెడుతుంది. మొత్తానికి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading