Home /News /movies /

JABARDASTH COMEDIAN VINOD GIVEN POLICE COMPLAINT HERE ARE THE DETAILS TA

Jabardasth Vinod: మరోసారి పోలీసులను ఆశ్రయించిన జబర్ధస్త్ కమెడియన్ వినోద్..

జబర్ధస్త్ వినోద్ (Twitter/Photo)

జబర్ధస్త్ వినోద్ (Twitter/Photo)

Jabardasth Vinod: జబర్ధస్త్ కామెడీ షోలో తనదైన స్కిట్స్‌లో ఆకట్టుకునే నటుల్లో వినోద్ ఒకరు. ఎక్కువగా మహిళ పాత్రలతో ఈయన ప్రేక్షకులకు చేరువ అయ్యారు. తాజాగా ఈయన మరోసారి పోలీసులను ఆశ్రయించారు

    Jabardasth Vinod: జబర్ధస్త్ కామెడీ షోలో తనదైన స్కిట్స్‌లో ఆకట్టుకునే నటుల్లో వినోద్ ఒకరు. ఎక్కువగా మహిళ పాత్రలతో ఈయన ప్రేక్షకులకు చేరువ అయ్యారు. తాజాగా ఈయన మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాజాగా ఈయన తనకు న్యాయం చేయాలంటూ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని ఆయన ఆఫీసులో కలిసి తను అద్దెకుంటున్న ఇంటి యాజమానిపై ఫిర్యాదు చేసాడు. గతంలో ఈయన అద్దెకుంటున్న ఇంటిని కొనుక్కుందాని ఆ ఇంటి ఓనర్‌కు  రూ. 13 లక్షల అడ్వాన్స్ రూపంలో చెల్లించాడు. అప్పట్లో రూ. 40 లక్షలకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని ఇపుడు మాత్రం ఎక్కువ డబ్బులు ఇస్తేనే ఇంటిని అమ్ముతానని చెబుతున్నాడు. ఒకవేళ కొనుక్కోక పోతే.. అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన రూ. 13 లక్షలు కూడా వెనక్కి ఇవ్వనని చెప్పినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో వినోద్ ఇంటి యాజమాని అతనిపై దాడి చేసినట్టు కాచిగూడ పీస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది కూడా. గతంలో అతని ఫ్యామిలీ మెంబర్స్ అతనికి పెళ్లి చేయడానిక ప్రయత్నించగా వినోద్ చేతి మణికట్టును కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth comedy show, Jabardasth vinod, Jabardasth vinodini

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు