కసి లేకపోతే రావద్దు.. మాజీ జబర్దస్త్ కమెడియన్ వేణు కామెంట్స్..

Jabardasth Venu: వేణు.. ఈ పేరు కంటే కూడా వేణు వండర్స్ అంటే ఈజీగా గుర్తు పట్టేస్తారు. జబర్దస్త్ మొదలైనపుడు ధన్‌రాజ్ బ్యాచ్‌తో కలిసి సంచలన స్కిట్స్ చేసాడు ఈయన.

news18-telugu
Updated: April 17, 2020, 10:16 PM IST
కసి లేకపోతే రావద్దు.. మాజీ జబర్దస్త్ కమెడియన్ వేణు కామెంట్స్..
జబర్దస్త్ వేణు (venu jabardasth)
  • Share this:
వేణు.. ఈ పేరు కంటే కూడా వేణు వండర్స్ అంటే ఈజీగా గుర్తు పట్టేస్తారు. జబర్దస్త్ మొదలైనపుడు ధన్‌రాజ్ బ్యాచ్‌తో కలిసి సంచలన స్కిట్స్ చేసాడు ఈయన. దానికంటే ముందే సినిమాల్లో కూడా నటించాడు. ప్రభాస్ మున్నా సినిమాలో టిల్లు పాత్రతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ బృందావనం సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో వేణు, ధన్‌రాజ్ చేసిన కామెడీ స్కిట్లు అదిరిపోయాయి. అక్కడ్నుంచి ఈ ఇద్దరూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వెంటనే మూడేళ్లకు జబర్దస్త్ మొదలైంది. అందులో తమ కామెడీతో సత్తా చూపించాడు వేణు.
జబర్దస్త్ వేణు (venu jabardasth)
జబర్దస్త్ వేణు (venu jabardasth)


జబర్దస్త్ మొదలైన కొత్తలో వీళ్లే సత్తా చూపించారు. ఆ కార్యక్రమం అంతగా పాపులర్ కావడానికి వేణు అండ్ టీమ్స్ చేసిన కామెడీయే ముఖ్య కారణం. జబర్దస్త్ షోలో ఈయన చేసిన కొన్ని స్కిట్స్ వివాదాస్పదం కూడా అయ్యాయి. ముఖ్యంగా కళ్లు గీత కార్మికులపై చేసిన స్కిట్ వివాదం రేపింది. ఆ తర్వాత ఈయనపై యాదవులు కొందరు భౌతిక దాడి కూడా చేసారు. ఆ తర్వాతే ఆయన జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.
జబర్దస్త్ వేణు (venu jabardasth)
జబర్దస్త్ వేణు (venu jabardasth)

బుల్లితెరతో పాటు సినిమాల్లోకి రావాలనుకునే వాళ్లు ఏదో ఒకటి చేద్దామని వస్తే సక్సెస్ కాలేరని చెప్పాడు వేణు. కచ్చితంగా గుండెలనిండా కసితో పాటు సాధించగలమనే సత్తా కూడా ఉండాలని చెప్పుకొచ్చాడు ఈయన. దాంతో పాటు అవకాశాలు రాకపోయినా కూడా నిలబడేంత ఓపిక ఉండాలంటున్నాడు వేణు. జబర్దస్త్ కామెడీ షోలో తన టీమ్‌లో పనిచేసిన వారే టీమ్ లీడర్స్‌గా ఎదిగిపోయారని.. దీంతో తాము జబర్దస్త్‌కు పూర్తిగా దూరమయ్యామని చెప్పుకొచ్చాడు వేణు. ఈ మధ్యే ఈయన అదిరింది ప్రోగ్రామ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కచ్చితంగా అదిరింది ఇంటింటికి వెళ్తుందనే నమ్మకం ఉందని చెబుతున్నాడు ఈయన.
Published by: Praveen Kumar Vadla
First published: April 17, 2020, 10:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading