Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే నిజంగానే..
జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలతో ఎంత మ్యాజిక్ చేస్తారో.. టీవీల్లో సుధీర్ కూడా అంతే మ్యాజిక్ చేస్తున్నాడు. ఆయన ఏ షో చేసినా కూడా బ్లాక్‌బస్టరే. ఎక్కడ అడుగు పెడితే అక్కడ రేటింగ్స్ వర్షం కురుస్తుంది. ఎందుకంటే మనోడి యాంకరింగ్ అయినా.. కామెడీ అయినా కూడా అలా ఉంటుంది మరి.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
అందుకే సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఈయనతో షోస్ ప్లాన్ చేయడానికి చాలా ఆసక్తి కూడా చూపిస్తుంటారు. ప్రస్తుతానికి మల్లెమాలకు కట్టప్పలా మారిపోయాడు ఈయన. జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు చేస్తున్నాడు. అయితే ఇంత ఇమేజ్ ఉన్న సుధీర్ ఇప్పుడు ఒక్క మాటంటే భయపడిపోతున్నాడు. సన్నిహితుల దగ్గర కూడా తప్పు చేసానని ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
అదే హీరో కావడం.. ఇక్కడ ఉన్న ఇమేజ్ చూసి పెద్ద తెరపై కూడా సక్సెస్ అవతాననే నమ్మకంతో హీరోగా నటించాడు ఈయన. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో పాటు ఈ మధ్యే తన టీంతో కలిసి నటించిన 3 మంకీస్ సినిమా కూడా ఎప్పుడొచ్చి వెళ్లిందో తెలియదు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత సుధీర్ హీరోగా నటించనని చెప్పాడు. హీరోగా నటించకూడదని చెప్పినా కూడా కొన్నిసార్లు మంచి కథలు విన్నపుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తుంటారు. ఇప్పుడు సుధీర్ కూడా ఇదే చేసాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
తాజాగా ఈయన మరోసారి హీరో అవుతున్నాడు. ఇప్పటికే ఈయన ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా పేరు కాలింగ్ సహస్ర.. అంటే సహస్ర అనే అమ్మాయిని పిలుస్తున్నాన్నమాట. పూర్తిగా ఇది కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుంది. కచ్చితంగా ఈ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా హిట్ కూడా కొడతానంటున్నాడు సుధీర్.
కాలింగ్ సహస్ర సినిమా కోసమే లుక్ కూడా మార్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇప్పటికే యాంకర్ రవి, ధన్‌రాజ్, షకలక శంకర్ లాంటి వాళ్లు కూడా హీరోలుగా ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు సుధీర్ చేరిపోయాడు. త్వరలోనే యాంకర్ ప్రదీప్ కూడా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అంటూ చెప్పడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు సుధీర్ మరోసారి హీరోగా వస్తున్నాడు. మరి ఈయన జాతకం ఎలా ఉండబోతుందో..
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.